జీవ యోగం
• యోగమిది అమోఘమిది
జీవన సౌఖ్య సారమిది .
• రాగమిది సరాగమిది
ఆశల పల్లకి గానమిది .
• శివుని ధారణం శ్వాస సంబరం
సజీవనం అయిన ప్రాణమిది .
• జ్ఞాన దప్పికం జీవ చేతనం
ఆనందపు హేలల గోల ఇది .
• యోగమిది అమోఘమిది
జీవన సౌఖ్య సారమిది .
• రాగమిది సరాగమిది
ఆశల పల్లకి గానమిది .
• దివ్య పరిమళం మంచు మధువనం
యోగుల హృదయం ప్రేమ ప్రాంగణం .
• పూల సాగరం భ్రమర రాగము
నిర్మల మనసుల వినుల వీక్షణం .
• యోగమిది అమోఘమిది
జీవన సౌఖ్య సారమిది .
• రాగమిది సరాగమిది
ఆశల పల్లకి గానమిది .
• వెతల వర్ణాలు మతిన మూలాలు
వసంతం నింపిన కాలమిది .
• కతల కావ్యాలు మనసు భాసలు
శిశిరం చేసిన సమయమిది .
• యోగమిది అమోఘమిది
జీవన సౌఖ్య సారమిది .
• రాగమిది సరాగమిది
ఆశల పల్లకి గానమిది .
దప్పికము = దాహం
భ్రమరము = తుమ్మెద
వెతల = దుఃఖాల
వర్ణాలు = రంగులు
మతి = బుద్ధి
మూలాలు = సూక్ష్మాలు
శిశిరం = పొగమంచు, చల్లదనం
యడ్ల శ్రీనివాసరావు 11 Aug 2025 , 3:00 pm.
No comments:
Post a Comment