నన్ను “నేను” వదులు కుంటున్నాను
• నన్ను “నేను” వదులుకుంటున్నాను . “నేను” అనేది నాకు చాలా భారం గా అనిపిస్తుంది. భరించలేని నొప్పి ని కలిగిస్తుంది. ప్రతీ ఆలోచన ని , కర్మని రోజు రోజుకు బరువుగా చేస్తుంది. దీనంతటికీ కారణం నాలో ఉన్న “నేను” అని తెలుసుకున్నాను.
• బహశ ఈ “నేను” , అహంకారం అయి ఉండవచ్చు . అది ఎక్కువగా ఉన్నా, తక్కువ గా ఉన్నా సరే నా తలపై ఉండడం వలన, భారం గా బరువు గా అనిపిస్తుంది. అందువలన తేలికగా అవలేక పోతున్నాను. తేలికగా కానప్పుడు నేను , ఆ పైన ఉన్న నా లోకానికి సంతోషంగా ఎలా వెళ్ల గలను . నా తండ్రి ని ఎలా కలుసుకోగలను . ఆయనను నేడు కింద నుంచి చూస్తున్నాను. కానీ ఆయన దగ్గరకు వెళ్ళాలంటే , నాలో ఏదో బరువు భారంగా అనిపిస్తుంది . ఆ బరువు పేరు “అహం” అని తెలిసింది. సర్వత్రా ఇదే నాకు అడ్డంకి అవుతుంది.
అందుకే నన్ను “నేను” వదులుకుంటున్నాను. I my self withdrawing .
• అనేక జన్మలు గా “అహం” పొరలు పొరలుగా కమ్మేసి ఉండడం వలన లోపల బంధింపబడి ఉండిపోయిన “నేను” , నేడు ఈ సృష్టిలో తేలికగా అవలేక పోతున్నాను . ఉన్న స్థానం నుంచి ఎగరలేక పోతున్నాను .
అహంకారం వలన నా లోని “నేను” నిజం మాట్లాడలేక అసత్యాలు మాట్లాడవలసి వస్తుంది, వివాదాలు , అలజడులు సృష్టించుకుంటున్నాను. ఇతరులకు దుఃఖం పంచి పెడుతున్నాను.
నా లోని “నేను” నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రం నిత్యానందం పొందుతూ , నా తండ్రి శివుని యొక్క వెలుగు చూడగలుగుతున్నాను. అందుకే సాధ్యమైనంత వరకు మేల్కొని ఉండడానికి ప్రయత్నిస్తున్నాను .
నా లోని “నేను” అనేక కోరికలు కోసం నిత్యం వెంపర్లాడుతుంది . దక్కని వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. శారీరక వాంఛల కోసం , ధనం కోసం , కీర్తి ప్రతిష్టలు కోసం పరితపిస్తున్నాను . అందుకే నాకు “ నేను “ బరువు గా భారం గా అయిపోయాను.
• నేను ఎప్పటికైనా ఎగరాలి , ఎగరలేక పోతే అంతిమ ఘడియలు భూమి పై నరకం అనుభవించ వలసి వస్తుంది , అందుకోసం తేలికగా ఇప్పటినుంచే అవ్వాలి . అందుకే నన్ను “ నేను “ వదులు కుంటున్నాను .
ఇంతకీ
ఆ “ నేను “ ఎవరో చెప్పలేదు కదా !
" నేను " ఒక ఆత్మను .
నా ఆత్మ లోనే మరొక
" నేను " అహంకారం .
" నేను " ప్రతి మనిషి లో ఉన్నాను.
ఆత్మ లో అహంకారం తొలగినపుడు మాత్రమే తేలిక అయి పరమాత్మ వైపు పయనిస్తుంది.
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
ఆత్మ 23 July 2026 3:15 PM .


No comments:
Post a Comment