పుట్టిన రోజు
• దేవుడు మనిషి కి ఇచ్చిన రోజు
పుట్టిన రోజు
అది అందరికి నచ్చిన రోజు .
• పుట్టడం అంటే పుణ్యం
అది అర్దం చేసుకుంటే ధన్యం.
• ఎందుకంటే . . .
• ఆత్మ వైన నీవు
పరమాత్మ ను అడిగి
ఎంచుకున్న దే నీ జన్మం .
• దేవుడు మనిషి కి ఇచ్చిన రోజు
పుట్టిన రోజు
అది అందరికి నచ్చిన రోజు .
• భవబంధాలు
నీ గత జన్మల బుణాలు .
• రక్త సంబంధాలు
నీ కర్మ ను తెలిపే బాధ్యతలు.
• నీ జన్మను సఫలం
చేసుకునేందుకే ఈ భూమి
ఓ పుణ్యక్షేత్రం .
• అది తెలిసి మసలుకున్న నాడు
నీ మనసు అవుతుంది దివ్యక్షేత్రం.
• దేవుడు మనిషి కి ఇచ్చిన రోజు
పుట్టిన రోజు
అది అందరికి నచ్చిన రోజు .
• సుఖదుఃఖాలలో ఆరితేరితే
రెండు సమానం అని తెలియును .
• విధి రాతలో మునిగి తేలితే
జీవితం ఒక నాటకం
అని తెలియును.
• భరత భూమి
భోగ భూమి కాదు
కర్మ భూమి .
• దేవుడు మనిషి కి ఇచ్చిన రోజు
పుట్టిన రోజు
అది అందరికి నచ్చిన రోజు .
• పుట్టడం అంటే పుణ్యం
అది అర్దం చేసుకుంటే ధన్యం.
🌹🌹🌹
భవ బంధాలు = ఈ సంసారంలో (భూమిపై) పుట్టుకతో ఏర్పడే మమకారాలు, అనురాగాలు , మోహం మరియు సంబంధాల ఆశల వలయం
ఓం శాంతి
శివ బాబా (శివుడే తండ్రి )
యడ్ల శ్రీనివాసరావు 5 Nov 2026 , 11:30AM.

No comments:
Post a Comment