ప్రకృతి ప్రేమ
• చలి చలిగా చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి.
• తడి తడిగా చినుకులు చిత్తడి చేస్తూ ఉన్నాయి.
• నీలి రంగు ఆకాశం నల్ల మబ్బులతో కమ్మెస్తుంటే…
• అడవి లోని పక్షులు ఆనందం తో ముసురుతూ ఉంటే…
• కళ్ల లోని ఆనందం అన్వేషణ అవుతుంది.
• మనసు లోని సంతోషం ఆలాపన అవుతుంది.
• జడి జడి గా జలధారలు జారుతూ ఉంటే
• పద పదమని మనసులు జోడీ కడుతూ.
• వడి వడిగా అడుగులో అడుగులు వేస్తూ…
• అడవి తల్లి ఇంటిలో….
• మంచె మాటు నీడలో …
• జత జత గా మన చేతులు ఒకటవుతుంటే.
• తహ తహతో తనువులు తేలుతూ ఉన్నాయి.
• నీ కంటి పాపలో నా రూపం కనిపిస్తుంటే…..
• నీ రెప్పలు తటపటలాడుతూ…..
• సంబరాలు చేస్తున్నాయి.
• ఈ చిత్తడి జల్లుల చిటపటలు….
• నీ చిరు నవ్వుల పాలిట ముత్యములై రాలుతూ ఉంటే…..
• నా దోసిలి బరువు అవుతుంది.
• తడిచి ముద్దైన తనువులకు….
• చిరుజల్లుల తలంబ్రాలు గా….
• దీవెనలు ఇస్తుంటే ఇంకేమి కావాలి నాకు….
• వనము లో ని కుందేలు కలవర పడుతుంటే,
• నెమలి నాట్యం తో ఓదారుస్తుంది.
• ప్రకృతి ని ప్రేమిస్తే ఇంతకంటే ఇంకేం మిస్తుంది.
యడ్ల శ్రీనివాసరావు 23 జనవరి 2022, 9:50 pm
No comments:
Post a Comment