సంక్రాంతి
🌾🌵🌻🌿🌱🌴
• సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ……..నీ రూపం తెలుగుదనం లోని వెన్నెల వెలుగు అవుతూ ఉంది.
• నువ్వు గంగిరెద్దుల గంగన్నకు ధాన్యము పోస్తూ ఉన్నపుడు, ఎద్దు మెడ లోని గంటలు గణగణలాడుతూ ఉంటే…..నీ కాలి గజ్జెలు సవ్వడితో శృతి చేస్తూ ఉన్నాయి.
• నీలాల పసుపు పచ్చని పరికిణీలో నిన్ను, పల్లె లోని పైరులు చూసి గుసగుసలు ఆడుతూ ఉంటే…..గుసగుసలు విన్న సీతాకోకచిలుకలు, నీ చుట్టు తిరుగుతూ , నీ అందానికి అసూయ పడుతూ ఉన్నాయి.
• చెంగు చెంగున గెంతుతూ, పల్లె పాటలు పాడే నీ కూని రాగాలకు , నీ దాగుడు మూతల వయ్యారి జడగంటలు నాట్యమే చేస్తూ ఉంటే ….. పెరటి చెట్టు మీద గోరింక కన్ను ఆర్పక చూస్తూ ఉంది.
• నీ నవ్వులోని, పళ్ల అందమును చూసి …..పొలము గట్టున బోదెలో స్వచ్చమైన తెల్లటి నీళ్లు పరవళ్లు తొక్కుతూ, నొచ్చుకుంటూ నలిగి నలిగి… పోతూ…పోతూ… ఉన్నాయి.
• పల్లె అంతా కలియ తిరిగిన నిన్ను, ప్రకృతి….. నీ చూపు లోని మురిపెం తో, సంక్రాంతి ఆభరణం గా ఆనందిస్తూ ఉంది.
• సంక్రాంతి పద్మము లో గొబ్బెమ్మలా నీ ముఖము లోని తేజం మురిపిస్తూ ఉంటే…….. మనసు దోచిన గొబ్బెమ్మ ముంగిట నిలిచి చూడాలని ఉంది.
యడ్ల శ్రీనివాసరావు 14 జనవరి 2022 ,11:00 pm.
No comments:
Post a Comment