Tuesday, January 11, 2022

125. అమ్మ ప్రేమ

 

అమ్మ ప్రేమ


• “అమ్మా” అనే రాగము లో నే 

   అనురాగం తెలిసింది.

• అమ్మలోని మురిపాలు పాలతో 

  అమృతమై ఆకలి తీర్చింది.

• నా కనులు తెరిచిన గంటలలో కంటికి కనపడని

  నీవు, అనురాగము తో అమృతం పోశావు.

• పెనిమిటి పై ఉన్న ప్రేమను మించి …

 నా పైన “ ‘పర’ వశమే” అయ్యావు.


• చంకనేసుకుని చేతి ముద్దలతో “చందమామ రావే జాబిల్లి రావే” అంటుంటే, నాటి చిరునవ్వుల నీ రూపం నేటికీ చందమామ లోనే కనిపిస్తుంది.

• అర్థరాత్రి నిదురలో అరచేతితో నను నిమురుతుంటే, నాటి నీ కౌగిలి స్పర్శకి నేడు నా కంట నీరు కారుతూనే ఉందమ్మా.

• చిరుతిళ్ళు కోసం చిల్లర పైసలిచ్చిన……నీ చూపు నా ఆకలి చుట్టూ నే ఉండేది.

• అమ్మా…. భావోద్వేగాల సంగ్రామం లో ఒకరి పై కోపం నీ పై చూపిస్తుంటే….నీ సహనం తో తల్లడిల్లిన ఆ నాడు…..ఈ నాడు ఏహ్యం గా అనిపిస్తుంది నాకు.


• నాడు నా శరీరం పై గాయాలకు తల్లడిల్లావు…

 నేడు నా మనసు గాయానికి రక్షణ అయ్యావు.

• అమ్మ….ఇంత చూసిన నిన్ను….ఇంత చేసిన నిన్ను…. ఒంటరిని చేసి నేనెట్ట బ్రతికేది, నేనేడకు పోయేది, నేనెవరికోసం జీవించేది.

• అన్నీ మరచినా….. నాకు అన్నమే దొరికే నా?.....ఆనందమే మిగిలే నా?


• వయసును బట్టి మనిషి కి ప్రేమపై, ప్రేమలోని భావం మారుతూ ఉంటుందేమో……. కానీ, మనసు కు మూలమైన ప్రేమ తల్లి బీజం నుండి వృద్ధి చెందినదే.

• తల్లి, కూతురు, సోదరి, భార్య....... ఈ జీవన నాలుగు స్తంభాలాట లో    స్త్రీ ప్రేమ  ఎందరినో ఉత్తములు గా  తీర్చి దిద్దగలదు…. అది స్త్రీ యెక్క  లేేదా  స్త్రీ  పై  ఉన్న  రక్తి,  అనురక్తి,  విరక్తి …...ఏదైనా కావచ్చు.


యడ్ల శ్రీనివాసరావు, 11 జనవరి 2022, 6:00 am.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...