Sunday, January 9, 2022

122. శివైక్యం


శివైక్యం



• ఎవరినో    నే నెవరినో

  ఎవరినో     నే నెవరినో

• గమనం  ఎటువైపో

  పయనం  ఎటువైపో  ఈశ్వరా!


• ఎవరివో   నీ వెవరివో

  ఎవరివో   నీ వెవరివో

• ఎల్లలు దాటి   ఎదురేగి నా    

   కానరాని   నీవెక్కడో  ఈశ్వరా!


• ఆది  అంత్యాల  నడుమ 

  ఊయల ఊపే నీ ఆట ఏమిటో


• గమనం  ఎటువైపో

  పయనం  ఎటువైపో ఈశ్వరా!


• చీకటి లోని నాకు  

  నీ నీడ   

  నీ చెంతకు చేరుస్తుంటే 

  ఇక నేనేమి చూడాలి శివా!


• కదలని రూపం తో

  కదిలే సాకారం నీవే శివా!


• నీ నీడలో వస్తూ ఉంటే అందమైన 

  అందని పువ్వును కానుక గా ఇస్తున్నావు

  ఉద్యానవనం లో విహారం చేయిస్తున్నావు

  ఇది నీ పరిక్ష యే కదా శివా!


• మాయ లోని మర్మం 

  మదికి ఎరుక అవుతుంటే

  మలినాలను మోసే కాయం 

  కమనీయం కాదు కదా శివా!


• తలంపు లోని తరంగాలు 

  అంతరంగాన్ని  తెరిపిస్తుంటే 

  మదిలో న   మాటు వేసిన  

  మూలవిరాట్టు వి  నీవే కదా శివా!


• కలలు కన్న జీవితం 

  కల్లోల కడలి అయితే

  ఇక మిగిలినది 

  కలవరమే అనుకుంటే

  నీ కరుణ తో   కడలి నే 

  క్షీరమయం  చేసావు    కైలాసనాధ!


• శివ 

   ఏమివ్వగలను నీకు

   నీవిచ్చిన భిక్ష లో అక్షరము తప్ప.


• మలినం నిండిన శరీరం పై 

  మమకారం లేదు కానీ 

  లో లో ని బిందు స్వరూపం 

  నీ సన్నిధి కోరుకుంటుంది.


• ఆత్మను అర్పితం చేసినా

   ఇంకా  నాతో 

   ఈ ఆట లేల

   ఈ పాట లేల

   ఈ రాత లేల

   శరీరం మిగిలి ఉన్నందుకా శివా!


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు , 9 జనవరి 2022, 6:30 pm.












No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...