Tuesday, January 18, 2022

129. బాల్యం….వజ్రతుల్యం

 

                   బాల్యం….వజ్రతుల్యం

• ఓహోహో…హహహ…. లాలాలా….లలలలా.

• మదిలో చెదరని బాల్యమే

  కనుల ముందు కదలాడుతూ

  కలియ తిరుగుతూఊఊ ఉంది.


• ఓహోహో…ఆహహహ…లాలాలా….లలలలా.

• పెరిగిన వయసు కి ధనము లా

  తరగని మనసు కు ఇంధనము లా

  బాల్యం కనిపిస్తూ ఉంది

  నా చిన్ని బాల్యం పిలుస్తూ ఉంది.

• లల లా…లాలా లా….లాలా లా…..లలలలా.


• ఆ రోజు సాయంత్రం

  ఆకాశం ఉరుముతూ

  మేఘాలే చెదురుతూ

  ఈదురు గాలులు వీస్తున్నాయి

  కారు మబ్బులు కరుగుతున్నాయి.


• చిటపట చినుకుల లో…. చిందులాటల తో

  జోరు వర్షం లో చెక్కిలి గిలి హేలలు, గోలలు.


• అమ్మమ్మ ఇంటిలో…. తాటాకు సూరులో

  ధారలు ధారలు జలధారల వర్షం జారుతూ ఉంటే


• చిలక పళ్ల నవ్వులతో……చిట్టి పొట్టి గౌను లో

  చిన్ని చిన్ని గంతులతో…..చిందేసెను నా వయసు.


• ఆహహ…ఆహహహ…లాలాల….లలలలా…


• వర్షపు నీటి లో కాగితపు పడవలు

  నా చిట్టి మనసుకు రెక్కలు తొడిగిన ఆనందం.


• వర్షపు మట్టి పరిమళమే  పన్నీరు గంధం లా 

  ముక్కు పుటాలకు మధురం లా ఉంది.


• ఆ బాల వాసనలే….నేటికీ సువాసన లై

  ప్రాణం నిలుస్తొంది…..జీవనం గడుస్తోంది.


• ఓహోహో…ఆహహహ….లాలాలా…లలలలా.


• వర్షపు నీటినే అడిగా

  ఎందుకు నా కీ ఆనందమని.

• ఈదురు గాలినే అడిగా 

  ఎందుకు నా కీ జ్ఞాపకాలు అని.


• అవి ఏమన్నాయో తెలుసా 

  ఏమంటున్నాయో తెలుసా


• కలుషితం కాని నీరు లా 

  నా లోని బాల్యం   

  సెలయేరు లా నిలిచి ఉందంట.


• దుర్గంధం లేని గాలి లా

  నా లోని బాల్యం 

  చందనం లా   చెదపట్టక   ఉందంట.


• ఆనంద స్మృతుల  గాలి నీరు 

   కలిసి చందనపు సెలయేరైన, 

   నా బాల్యాన్ని ప్రకృతి 

   తన ఒడిలో లాలిస్తుందట.


• ఆహహ…. ఓహోహో….లావాలా…లలలలా.


• ఇంకేమి కావాలి నాకు

  నా లో జీవం లేకున్నా  నా బాల్యం సజీవం 

  ప్రకృతి లో కలిసిన  నా బాల్యం సజీవం.


• బంగారు కలలు కనే భవిత  కంటే

  గడచిన బాల్య స్మృతులే వజ్రతుల్యం.


• ఔనన్న....కాదన్నా….ఇది నిజమే కదా..


• ఓహోహో…ఆహహహ…లాలాలా…లలలలా.



యడ్ల శ్రీనివాసరావు 17 జనవరి 2022, 10:30 pm.




No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...