వైకుంఠ ఈశ్వరా_ కైలాస శ్రీనివాస
• వేయి పడగలు నీడ
వైకుంఠ వాసా శ్రీ వేంకటేశా.
• కోటి తీర్థముల తోడ
కైలాస వాసా శ్రీ పార్వతీశా.
• ముల్లొక దేవతలు
మీ ముందు నిలిచి ముత్యాల
మిమ్ము మననమే చేయ …
• వందనము వందనము …
శుభవందనము అభివందనము.
• కలియుగ దేవా శ్రీ వేంకటేశ్వరా …
పాపాలను (వేం)
హరించ(కట)
అవతరించిన శివా(ఈశ్వరా).
• మాయలో మునిగి తేలే వారికి
జ్ఞానధన సముపార్జనకు మార్గము
సుగమం చేయ వెలిసిన శ్రీ రంగనాథ.
• సంథికాలమున సకలజనుల
సంరక్షణకు సంగమించిన సంగమము
శివకేశవుల సంగమం.
• శ్రీ వేంకటేశా…. శ్రీ శ్రీనివాసా…
నీ మోము లో సిరులు
తేజోవిలాసంతో కురుపించు
మా పైన శ్రీ చిద్విలాసా.
• నందనాల నందీశ్వరుని కి
మనసాభివందనము.
• చందనాల నారసింహుని కి
శిరసాభివందనము.
• కుందనాల కాలేశ్వరుని కి
హృదయాభివందనము.
• భూలోక సుఖదామము
అజ్ఞాన ఆకృత్య ఆడంబరాలతో
దుఃఖదామము గా మారెను.
• శ్రేష్టమైన కర్మలతో
పతితులను పావనము గాంచి
జ్ఞాన శక్తి తో జీవన ముక్తులను
గాంచు శ్రీ హరనాథ.
• ఓం నమో నారాయణాయ
నీ నామ అష్టాక్షరీ …
ఓం నమఃశివాయ
నీ నామ పంచాక్షరీ ...
జీవుడికి జననమరణ చక్రాన్ని
తప్పించే ముక్తి ఆయుధాలు.
• ఓం శివకేశవాయనమః 🙏
• యడ్ల శ్రీనివాసరావు 13 జనవరి 2023 , 1:50 pm.
No comments:
Post a Comment