Sunday, January 9, 2022

124. ప్రకృతి లో ఒక రోజు

 

 ప్రకృతి లో  ఒక రోజు

• తెలవారుతుంది  తెల తెలవారుతుంది 

  నింగి లో ని తళుకు బెళుకు తారలకు 

  నిదురవుతు ఉంది.


• మంచు దారలతో తడిసిన 

  పచ్చని పైరు లన్ని నిదుర మేలుకొని 

  నిటారుగా అవుతున్నాయి.


• రంగు పూసుకున్న సూర్యుడు 

  రొమ్ము విరుచుకుని,  దిన రంగంలో

 అడుగుపెడుతున్నాడు.


• పైరు మీద కోయిలలు కుహు కుహు రాగాలతో

  గింజల కోసం గిరులు దాటి పోతున్నాయి.


• చేతి సంచిన సద్ధి మూటతో శ్రామికులు 

  శ్రమ కోసమై , పంటపొలాల గట్లపై ఉరుకులు

  పెడుతున్నారు.


• నడినెత్తిన చేరిన సూర్యునికి 

 నడక తగ్గినందుకు  గోదావరి తల్లి,  

 సెలయేటి చెల్లి  దాహంతో దహనం అవుతున్నారు.


• చింత చెట్టు నీడలో , సద్దిమూట అన్నం 

  పరమాన్నం గా తింటున్న కర్షకులు , 

 కందిరీగ హోరు ను జోలపాటలా వింటున్నారు.


• చెరువు చెంతకు చేరిన 

  తెల్లని కొంగల సమూహం , 

  తెరిచి తరచి చూస్తున్నాయి చేపల కోసం.


• మండుటెండలో ని చెట్లన్నీ 

 ఒకే జాతివి కాకపోయినా , చిరునవ్వులతో 

 అటుఇటు ఊగుతూ, చల్లని నీడతో 

 సూర్యుడిని వెక్కిరిస్తున్నాయి.


• ఒంగి నాటుతున్న వరినాట్లు తో, 

 రవిక జారిన రంగిని 

 చల్లని పిల్లగాలులు తాకుతూ ఉంటే , 

 తొంగి చూస్తున్న సూర్యుడు నిరాశ పడుతున్నాడు.


• సాయంసంధ్య లో దిశ మారిన సూర్యుడు,  

  రంగు మార్చుకుని నిదురలోకి జారుకుంటున్నాడు.


• అలసి సొలసిన శ్రామికులు 

  బరువు తగ్గిన సంచి తో, 

  తిరుగు ప్రయాణంలో ఉన్నారు.


• గిరులు తిరిగిన పక్షులు , 

  గింజలు నోట కరుచుకుని 

  గూడు చేరుకుంటున్నాయి.


• నిటారుగా ఉన్న పంట పైరులన్ని 

  నడుము వాల్చడానికి సన్నాహం అవుతున్నాయి.


• మగత నిదురలో నుంచి, 

  మత్తు కళ్లను తెరుస్తూ చందమామ, 

  చుక్కలు రాతిరి రంగం లోకి అడుగుపెడుతున్నాయి.


• అలసట లేని ప్రకృతి అంతా గమనిస్తూ,

  సింగారం తో ఉన్న స్త్రీ మూర్తి లా 

  చిరునవ్వు తో చూస్తూ ఉంది.



యడ్ల శ్రీనివాసరావు 10 జనవరి 2022 9:00 am.





No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...