ఇతరుల విజయం మన సంతోషం
మనం ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించినప్పుడు, మనలో ఉన్న పోలికల ధోరణి (Comparison) అంతమవుతుంది మరియు మన జీవితంలో కొత్త అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి.
ఇతరుల కోసం చప్పట్లు కొట్టినంత మాత్రాన మనం ఏ మాత్రం తక్కువ అయిపోము , మన హృదయం, మన ఆలోచన మరియు మన జీవితం మరింత విశాలమవుతాయి.
ఇతరుల సంతోషాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభూతి చెందినప్పుడు, అదే సానుకూల శక్తి (Energy) మన జీవితంలోకి కూడా ప్రవహించడం మొదలవుతుంది.
చాలా సందర్భాల్లో ఇతరుల విజయాలను, వ్యక్తిత్వాన్ని బయటకు ప్రశంసిస్తూ నే , మనసు లో భారంగా ఉంటారు. దీనికి కారణం మనలోని నెగెటివ్ శక్తులైన ఈర్ష్య ద్వేషం. మనం బయటకు చక్కగా నటించినంత లో మనం ఉన్నతులుగా గుర్తించబడలేం సరికదా మన మనో స్థితి ఉన్నతం కాకుండా మనకు మనమే నిరోధకాలుగా అవుతూ మన విఘ్నాలకు మనమే కారణం అవుతాం . అందుకే విశాల హృదయులు గా కావడం మనలో మనకి చాలా ముఖ్యం.
గుర్తింపు కోసం, మంచి వారిగా అనిపించు కోవడం ఇతరులను ప్రశంసించడం మంచిది కాదు. మనసు కు స్వయం గా అనిపించిన నాడే , ఇతరుల ను ప్రశంసించడం మేలు .
ప్రశంస , పొగడ్త రెండూ ఒకేలా అనిపించినా, ఒకటి కావు. పొగడ్త లో అతిశయం, స్వలాభపేక్ష , ఉద్వేగం దాగి ఉంటాయి , ఒక పొగడ్త ఇతరుల కోసం చేసినపుడు, మనం తిరిగి ఏదో ఒకటి ఆశించడం, కోరుకోవడం అనేది అంతర్లీనంగా జరుగుతుంది .
ప్రశంస , శరీరానికి అతీతంగా మనసు లోతు నుంచి సహజంగా వస్తుంది. ఇతరుల విజయం మన విజయం గా అనుభవించినపుడు సహజమైన సంతోషం తో ప్రశంస పుడుతుంది. ఒకరిని ప్రశంసించడం ద్వారా మనలో సంతోషం రెట్టింపు అవుతుంది . సంతోషం ఇతరులకు ఇవ్వడం తో పాటు , తిరిగి వారి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ మనల్ని , మనలోని సంతోషాన్ని సుధీర్ఘంగా ఉండేలా చేస్తుంది.
మనిషి జీవితమే ఒక నటన . కానీ అందులో మనం సహజ నటులు గా ఉంటేనే తేలికగా ఉండగలం .
కానీ, జీవితం అనే నాటకం లో , మనం మరింత జటిలమైన నటులు గా మారితే మన జీవిత డ్రామా చాలా చిక్కులు తో నిండి రసవత్తరం కాకుండా పోతుంది. ఒకానొక సందర్భంలో సరియైన డైరెక్షన్ మనకు మనం చేసుకోలేక విఫలం అయి అతలాకుతలం అవుతాం .
మంచి డ్రామా చరిత్ర లో నిలిచిపోతుంది. అలాగే జీవిత నాటకంలో మనం పోషించే పాత్ర ఎంత సహజంగా ఉంటే , మన ఆత్మ కి అంత సంతృప్తి లభిస్తుంది.
ఇతరుల లో చెడు గుణాలు లక్షణాలను మనం ఎంతగానో అసహ్యించు కుంటాం. వారితో కలవడానికి ఇష్ట పడం. వారి విషయాలను ఇతరులతో చర్చిస్తాం.
అదే విధంగా , మన లోని బలహీనతలను , అవ లక్షాణాలను ఇతరులు కూడా అసహ్యించు కుంటారనే విషయం మనం గమనించాలి. అంత కంటే ముందు మన అవ లక్షాణాలను మనమే గుర్తించి వాటిని అసహ్యించు కోవడం నేర్చు కోవాలి. ఇలా ఆత్మ విమర్శ చేసు కోవడం వలన ఇతరులు మనల్ని అసహ్యించు కొనే పరిస్థితి మన జీవితంలో తలెత్తకుండా ఉంటుంది .
నిశ్శబ్దం తో కూడిన సంతోషం , నీ అంతర్ముఖాన్ని తేజోవంతంగా చేస్తుంది . సంతోషం మనలో నిలిచి ఉండాలి అంటే , ఇతరుల ను సంతోషంగా ఉంచాలి. అందుకోసం మనం ఎవరినీ కీర్తించనవసరం లేదు. కేవలం సత్య మైన మనసు తో పెదవి విప్పి చెప్పే ప్రశంస చాలు. నిశ్శబ్దం తో కూడిన సంతోషం నీ కే సొంతం.
పొగడ్తలు ప్రమాదకరం.
ప్రశంసలు ఆరోగ్యకరం.
యడ్ల శ్రీనివాసరావు 30 Apr 2026 6:00 AM.

No comments:
Post a Comment