ఈ ప్రపంచం , మనలో మనం మోసుకెళ్లే శక్తికి నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది.
మన ఆలోచనలు తరంగాలుగా (Waves) మారతాయి. మన భావాలు (Feelings) ఆ తరంగాలకు బలాన్ని ఇస్తాయి. మన వైఖరి , ప్రవర్తన (Attitude, Behaviour) వాటికి దిశను (Direction) ఇస్తుంది.
ఆ తర్వాత మనం కలుసుకునే వ్యక్తులు, మనం అనుభవించే పరిస్థితుల ద్వారా జీవితం వాటిని నిశ్శబ్దంగా మనకే తిరిగి ప్రతిబింబిస్తుంది.
మీ ప్రపంచాన్ని మార్చుకోవాలని కోరుకుంటే, ముందుగా మీ అంతర (Internal) ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించండి. 🌿
మీ మనసును స్వచ్ఛమైన ఆలోచనలతో ,
మీ హృదయాన్ని మంచి భావాలతో ,
మీ వైఖరిని ఆత్మ చైతన్యంతో నింపుకోండి.
క్రమంగా బయట కనిపించే ప్రతిబింబం కూడా మారడం ప్రారంభిస్తుంది. 🌺
మీ గొప్ప ప్రభావం మీరు చెప్పే మాటల్లో లేదు.
మీరు ప్రసరించే ప్రకంపనల్లో ఉంది. ✨
🌹🌹🌹🌹🌹
❤️ స్వచ్ఛమైన ప్రేమ అంటే స్వాధీనం చేసుకోవడం, అనుభవించడం లేదా ఎదురు చూడడం కాదు. అది ఆత్మ యొక్క నిస్వార్థమైన స్థితి .
ఏదీ ఆశించకుండా ఇవ్వడం,
ఎటువంటి షరతులు లేకుండా శ్రద్ధ చూపించడం,
సహజంగానే దయను, మంచితనాన్ని ప్రసరించడం.
🌸 నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు...
ఆశ ఉండదు...
అది కేవలం ఇవ్వడంలోనే ఆనందాన్ని అనుభవిస్తుంది. ❤️
🌹🌹🌹🌹🌹
ప్రపంచం గొప్ప గొప్ప కార్యాల వల్ల మాత్రమే స్వస్థత పొందదు. చాలా సందర్భాల్లో, మనం ఇతరులను ఎలా అనుభూతి చెందేలా చేస్తామో, ఆ విధంగానే ప్రపంచం స్వస్థత పొందుతుంది.
🌿 ఒక సున్నితమైన మాట , ఆందోళనతో ఉన్న మనసును ప్రశాంతపరచగలదు .
😊 ఒక ఆప్యాయమైన చిరునవ్వు , ఎవరిలోనైనా కోల్పోయిన ఆశను తిరిగి కలిగించగలదు .
❤️ స్వచ్ఛమైన ప్రేమతో నిండిన హృదయం , మాటలు చేరుకోలేని విధంగా ఆత్మలను తాకగలదు.
ఇదే ఆధ్యాత్మిక జీవనం యొక్క నిశ్శబ్దమైన శక్తి.
🌸 మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి జీవితంలో
ఒత్తిడికి బదులుగా శాంతిని ,
తీర్పునకు బదులుగా ప్రేమను ,
గాయానికి బదులుగా ఆశను ,
వదిలివెళ్లే . . . ఒక అవకాశమే ఆధ్యాత్మికత .
మీ మాటలు ఆశీర్వాదాలుగా మారనివ్వండి .
😊 మీ చిరునవ్వు ఓదార్పుగా మారనివ్వండి.
❤️ మీ ప్రేమ , ఇతరుల స్వస్థతకు భగవంతుని సాధనంగా మారనివ్వండి.
🌹🌹🌹🌹
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు 🙏
ఓం శాంతి (ఆత్మ యొక్క స్వధర్మం శాంతి )
ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను)
శివబాబా (శివుడే తండ్రి)
# బ్రహ్మా కుమారీస్ డెస్క్
యడ్ల శ్రీనివాసరావు 13 Sep 2026 9:00PM.



No comments:
Post a Comment