శివునికి మాలలు కడతాను
• మాలలు కడతాను
నా శివుని కి మాలలు కడతాను .
• వాడి పోయేటి పూల మాలలు కావివి .
చెక్కు చెదరని అక్షర మాలలు .
• మాలలు కడతాను
నా శివుని కి అక్షర మాలలు కడతాను .
• శివాక్షరం అమరం . . .
పలికినంత లో
ప్రతి స్వరము సర్వము గా మారును .
• ఆ స్వరమే శివుని తో మమేకం .
ఆ సర్వమే ఆత్మ శక్తి చైతన్యం .
• అందుకే . . .
మాలలు కడతాను
నా శివుని కి మాలలు కడతాను .
• వాడి పోయేటి పూల మాలలు కావివి
చెక్కు చెదరని అక్షర మాలలు .
• శివాక్షరం అద్భుతం . . .
అల్లిక చేయుట లో
మెదడు లో నరములు నాట్యం చేయును
• ఆ నరములే పదముల నుడికారం .
ఆ నాట్యమే విశ్వనాథుని విన్యాసం .
• నేడు విశ్వం చుట్టే . . . ఈ పద మాలలు
చదివిన వారికి చిద్విలాసం
పాడిన వారికి పరిమళం . . . ఆత్మ పరిమళం.
• అందుకే . . .
మాలలు కడతాను .
నను ఎంచుకున్న
నా శివుని కి మాలలు కడతాను .
• వాడి పోయేటి పూల మాలలు కావివి
యుగ యుగాలు నిలిచే అక్షర మాలలు .
🙏
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతీ దేశం నుంచి ఈ బ్లాగ్ ను వీక్షిస్తున్న తెలుగు సాహితీ అభిమానులందరికీ (1,25,000 views) నా కృతజ్ఞతలు 🙏.
Please watch this inspirational song
Written & Compose by
Brahma Kumar Madhu U.S.A
Click here 👇👇
https://youtu.be/EiTWk7rRUHA?si=jpDLG1urz6IUbgxx
ఓం శాంతి
శివ బాబా ( శివుడు తండ్రి) 🙏 .
ఓం నమఃశివాయ
యడ్ల శ్రీనివాసరావు 18 Sep 2026 3:00 am.





No comments:
Post a Comment