Tuesday, September 8, 2026

782. గుడిలో రహస్యాలు

 

గుడిలో రహస్యాలు 


మనం గుడి కి వెళ్ళినప్పుడు ముందుగా ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తాం . అలా తప్పని సరిగా చేయాలి అని పూజారులు, పూర్వీకులు చెపుతూ వచ్చారు . కారణం అడిగితే , 3 ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలు తిరిగి నట్టు, చేసిన పాపాలు తొలగుతాయి అని అంటారు. ఆ నమ్మకం తో ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది .  మరి కొందరికి ఈ ప్రదక్షిణలు ఎందుకు చేయాలో కూడా అర్దం తెలియదు . 

నిజం గా అలా చేయడం వలన చేసిన పాపాలు తొలగుతాయా ? అంటే ముమ్మాటికీ కాదు. 


కానీ ఇందులో దాగి ఉన్న వాస్తవం వేరే ఉంది.

గుడికి వెళ్ళే వరకు కూడా , మనం అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం . అవి నిత్య కార్య వ్యవహారాలు , గృహస్థ వ్యాపకాలు , ఇంకొక అడుగు ముందుకు వేస్తే జీవితంలోని ఆందోళనలు అలజడులు తో ప్రతి క్షణం మనసు కొట్టుమిట్టాడు తుంది. ఈ స్థితి లో మనం కొంత నెగెటివ్ వైబ్రేషన్స్ ని కలిగి ఉంటాం . 

ఆలయం లోని భగవంతుడి దగ్గరకు ప్రశాంతత కోసం, దుఖ విముక్తి కోసం లేదా కోరిక నెరవేర్చమని అడగడానికి వెళ్తాం . 

భగవంతుని దర్శనం చేసుకొనే ముందు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో , మన బుద్ధి బయట ప్రాపంచిక ఆలోచనల నుంచి క్రమేపీ మారుతూ భగవంతుని పై దృష్టి సారించడం జరుగుతుంది . ఆలయం లోని గోడలు, శిల్పాలు చూస్తూ ప్రదక్షిణ చేయడం వలన అంతరంగం లో ఆలోచనల అలజడి తగ్గి మనసు సాధారణ స్థితికి వస్తుంది. ఆ పిదప మనం భగవంతుని దర్శనం చేసుకొనే సమయం లో ఏకాగ్రత తో మన సంకల్పాలు నివేదించడానికి మనో స్థితి సిద్దం అయి ఉంటుంది. ఇదే ప్రదక్షిణ లోని దాగి ఉన్న సూక్ష్మం. 

అలా కాకుండా, మనసు యొక్క దృష్టి ఎక్కడో పెట్టి గుడిలోని కి వెళ్లి రావడం వలన పొందే ఫలితం శూన్యం. 


🌹🌹🌹🌹🌹🌹



గుడిలో గంట కొడితే భగవంతుని కి వినిపిస్తుంది, మనం గుడికి వచ్చిన సంకేతం భగవంతుని కి చేరుతుంది అని , అందుకే గంట కొట్టాలి అని అనేకులు  అనుకుంటారు . 

కానీ ఈ అంశం లో ఇమిడి ఉన్న  సూక్ష్మం వేరు . 

గుడిలో గంట పంచ లోహల తో తయారు చేయబడుతుంది . అది మ్రోగించడం వలన వెలువడే శబ్ద తరంగాలు  హెచ్చు స్థాయిలో    ఫ్రీక్వెన్సీ తో వెలువడుతుంటాయి . అవి  మన  శరీరం పై  పడి    ఆ ప్రభావం చేత  మెదడుని  ఆలోచనలను  ఉత్తేజం గా చేస్తాయి . 

ఆ గంట ద్వారా వచ్చే లోహల యొక్క శబ్ద తరంగాలు , అప్పటి వరకు మనలో నెగెటివ్ వైబ్రేషన్స్ ని తొలగించి మనసు ను పరవశింప చేస్తాయి . 


🌹🌹🌹🌹🌹



గుడిలోని జడవిగ్రహ మూర్తి ని అంగ రంగ వైభవంగా అలంకరిస్తారు . అదే భగవంతుడి యధార్థ రూపం అని మనసు లో ముద్రించుకుంటాం . కానీ అంతలోనే భగవంతుని కి హరతి ఇస్తారు . ఆ హరతి ని కళ్ళకు అద్దుకుంటాం , వచ్చెస్తాం . కానీ అసలు హరతి ఎందుకోసం అనేది ఆలోచించం .

ఈ విషయం లో దాగి ఉన్న సూక్ష్మం . . .

 భగవంతుడు  చైతన్యమైన  వెలుగు , జ్యోతి ప్రకాశం . మనిషి లోని అజ్ఞానం , దుఃఖం అనే చీకటిని పారద్రోలే వాడు భగవంతుడు.  అంతే కానీ జడవిగ్రహ రూపం కాదు. 

ఆ హరతి జ్యోతి  బిందు రూపుమే పరమాత్మ స్వరూపం . 

అందుకే  హరతి ని మన రెండు కనుల మధ్య ఉన్న భృకుటి స్థానం లో విరాజమానమై ఉన్న మన ఆత్మ కోసం , చేతులతో అద్దుకుంటాం . ఆ హరతి మన కళ్ళ కోసం కాదు , మన ఆత్మ కోసం . 

మన ఆత్మ కి తెలుసు పరమాత్మ ఎవరు అనేది .  కానీ మన బుద్ధి . ‌. .  దేహ భావం తో   అజ్ఞానం  మాయ లో పూర్తిగా కూరుకుపోయి ఉండడం వలన మన శరీర స్పృహ  ఈ సత్యం గ్రహించదు . అసలు మనలో ఆత్మ ఉంది అనే విషయమే గ్రహించకుండా అనేక జన్మలు గడిపెస్తాం .

హరతి తీసుకున్న తరువాత 3 సార్లు మీ చుట్టూ మీరు ప్రదక్షిణ చేయమని పూజారి చెపుతారు. దాని అర్థం , మన లో ఉన్న ఆత్మ చుట్టూ మన శరీరం ప్రదక్షిణ చేయడం. దీనినే ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అని పూజారి అంటారు . మన శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి మన ఆత్మ . 


ఓం శాంతి  (ఆత్మ యొక్క స్వధర్మం శాంతి)

శివ బాబా (శివుడు తల్లి తండ్రి)

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను 🙏)


యడ్ల శ్రీనివాసరావు 9 Sep 2026 6:00 AM.

No comments:

Post a Comment

782. గుడిలో రహస్యాలు

  గుడిలో రహస్యాలు  మనం గుడి కి వెళ్ళినప్పుడు ముందుగా ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తాం . అలా తప్పని సరిగా చేయాలి అని పూజారులు, పూర...