Wednesday, January 15, 2025

585. కోయిల - కోమలి

 

కోయిల - కోమలి



• కుహు కుహు  . . .  కుహు కుహు

  అని   కూసిం దో     కోయిల.


• కోయిల    రాగం తో

  కలిగె   నా లో    కవ్వింత

• కోయిల    కోసం    వెతకగ

  కనిపించిం దో      కోమలి.


• కుహు కుహు  . . .  కుహు కుహు

  అని   కూసిం దో    కోయిల.


• కోయిల   కోసం   కోమలి   నడిగితే 

  హూహు   ..  హూహు ..  అని పలికింది.

• అటు    ఇటు    చూశాను

  కొమ్మ   రెమ్మ లు   వెతికాను.

• కోయిల    కనపడలేదు . . .

  కానీ   …  కానీ

  కోమలి    నా వెనకే    తిరుగుతూ   ఉంది.


• కుహు కుహు   . . .   కుహు కుహు

‌  అని   కూసిం దో     కోయిల.


• ఆగలేక   …   నీవెవరని   అడిగితే 

  కోమలి    కళ్లను   ఆడించింది . . .

  నీకెందుకు   కని.


• నే   వెను  తిరిగి   నంత లో


• కుహు  కుహు  …  కుహు  కుహు

  అని  కూసిందా  కోయిల   మళ్లీ . . .


• కోయిల   రాగం    రేపెను

  నా లో      పులకింత.

• కోయిల   కోసం    వెను చూడగా


• కోమలి   కళ్లతో     సైగ  చేస్తుంది …

  ఆ కోయిల    తానే   నని …

  ఆ రాగం   నా  కోసం    అని.


• కుహు  కుహు  . . .  కుహు  కుహు

  అని   కూసిం దో      కోమలి.


యడ్ల శ్రీనివాసరావు 15 Jan 2025 , 11:25 PM.



No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...