Saturday, January 4, 2025

578. ప్రేమ సంజీవని

 

ప్రేమ సంజీవని





• ప్రే   అంటే   ప్రేరణ  కాదు

‌  మ  అంటే  మరపు  కాదు.

• ప్రేమంటే    జీవి కి     ఓ సంజీవని.

  ప్రేమంటే   మరణం లేని   అమృతదాయని.


• ప్రేగు  తోని     పాశము

  ప్రేమ కి     తొలి    చిగురు.

• చనుబాల   ధారణ తో

  అది    వికసించేను.

• సృష్టి   స్థితి   లయ  ల   

  వారధి  యే   ప్రేమ.

 అది   తెలియక   పోవడమే    వికర్మ.


• ప్రేమ   నీ బలహీనత   అయితే

  విశ్వం    నిన్ను    ప్రేమిస్తుంది.

• ప్రేమ    నీ  బలము    అయితే

  సృష్టి నే    నీవు    ప్రేమిస్తావు.


• ప్రేమంటే     పెళ్లి    కాదు.

  ప్రేమంటే    ఇంద్రియ సుఖము   కాదు.

• ప్రేమ  లోని   గారాలన్నీ 

  శృంగారం    కాబోవు.

• ప్రేమ లోని    భావాలన్నీ

  రతిభావన    కాబోవు.

• ప్రేమంటే    లింగ మోహం   కాదు.

  ప్రేమంటే    కామ   వికారం   కాదు.


• ప్రేమ       లేని      జీవం       ఓ   పిశాచం.

  ప్రేమించ   లేని      ప్రాణం     ఓ   కాష్టం.

• నీ    సంతోషానికి    మూలం    ప్రేమ.

  నీ     దుఃఖానికి       వెలుగు     ప్రేమ.


• ప్రే   అంటే   ప్రేరణ    కాదు

  మ  అంటే   మరపు  కాదు.

• ప్రేమంటే    జీవి కి     ఓ సంజీవని.

  ప్రేమంటే   మరణం లేని   అమృతదాయని.


• ప్రేమంటే      నిను    నడిపించే     దైవం.

  ప్రేమంటే     జనన   మరణాల    అతీతం.

• మనిషి   ఉన్నా  …   లేకున్నా

  ప్రేమ     జీవం   ….   ప్రేమ  దైవం.

• అది    పుణికిపుచ్చుకున్న

  జీవి యే    చిరంజీవి.



స్వార్థం   లేని    ప్రేమ   

సత్యమైన   మనసులో   స్థిరమైనచో 

సంతోషం  ఇస్తూనే  ఉంటుంది.


యడ్ల శ్రీనివాసరావు 4 Jan  2025  3:30 PM





No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...