ఓ మనిషి మరచిపో
• ఓ మనిషి మరచిపో
పడిన కష్టాలను మరచిపో . . .
• ఓ మనిషి మరచిపో
పడిన భంగపాట్లను మరచిపో . . .
• మరుపు అనేది వరం
అది తెలుసుకుంటేనే ఘనం.
• హాయిగా ఎగిరే తుమ్మెద
అనుకుంటుంది . . .
ఈ భూమి చాలా సూక్ష్మమని.
అది నీకు స్ఫూర్తి కాదా . . .
• మెల్లగ నడిచే చీమ
అనుకుంటుంది . . .
ఎదురేమున్నా నాకేంటి అని.
అది నీకు స్ఫూర్తి కాదా . . .
• తుమ్మెద చిన్ననైన
రెప రెపలతో జీవిస్తుంది.
• చీమ అల్పమైన
ఆత్మ విశ్వాసం తో జీవిస్తుంది.
• నీ సమయం రాతిరై తే
తిరిగి పగలు రాదా . . .
• నీ సంకల్పం బలమై తే
కొండ పిండి కాదా . . .
• ఓ మనిషి మరచిపో
పడిన అవమానాలను మరచిపో . . .
• ఓ మనిషి మరచిపో
పడిన నిందలను మరచిపో . . .
• భాధలు మరిచిన
వానికి ధైర్యమే దైవం.
• బ్రతుకును ఆస్వాదించే
వానికి మనసు సంపూర్ణం.
• విశ్వం లో తారకి వెలుగు ఎందుకు.
విధిరాత లో డ్రామాకి దిగులు ఎందుకు.
• మరుపు అనేది వరం
అది తెలుసుకుంటేనే ఘనం.
• ఈ సృష్టిలో నీ కోసం
వేచి ఉంది ఓ శక్తి.
• అది పొందడమే
నీ జీవన భుక్తి.
• మరచిపో . . . మరచిపో
సర్వం మరచిపో . . . సమస్తం మరచిపో.
నిన్ను నీవే మరచిపో . . .
• మరచిపో . . . మరచిపో
సర్వం మరచిపో . . . సమస్తం మరచిపో.
నిన్ను నీవు మరచిపో . . .
యడ్ల శ్రీనివాసరావు 7 Jan 2025 8:30 PM
No comments:
Post a Comment