సుప్రభాతం
• సుప్రభాతం సుప్రభాతం.
• ఆశలు నిండిన మనసు కి
ఇది మధుర భాతం.
ఎదలో నిలిచిన ప్రియునికి
ఇది దివ్య భాతం.
• సుప్రభాతం సుప్రభాతం.
సుప్రభాతం సుప్రభాతం.
• ఉదయించని సూర్యుడి లా
తాకింది ఓ ప్రేమ.
జనియించని జాబిలి లా
నిండింది నా లోన.
• ఆ మరువని ఆలోచనలు
నా ప్రేమకు ప్రతిరూపాలు.
• ఈ వదలని మధుర క్షణాలు
నా ప్రేమకు ప్రతిబింబాలు.
• సుప్రభాతం సుప్రభాతం
• వేకువ చూడని ప్రేమకు విఘాతం.
కాలం కలపని చెలిమి కి అగాధం.
• సుప్రభాతం సుప్రభాతం.
సుప్రభాతం సుప్రభాతం.
• కలవని నీ పాదం తో
కొలువై నడవ లేనని
వెళ్లి పోమాకు
విడిచి పోమాకు.
• కలవని నీ పాణి తో
జత సరి లేనని
వీడి పోమాకు
వదలి పోమాకు.
• సుప్రభాతం సుప్రభాతం.
• ఆశలు నిండిన మనసు కి
ఇది మధుర భాతం.
ఎదలో నిలిచిన ప్రియునికి
ఇది దివ్య భాతం.
సుప్రభాతం = శుభమును సూచించు దిన ఆరంభం.
వేకువ = వెలుగు
విఘాతం = అవరోధం
పాణి = మణికట్టు నుంచి చాచిన వ్రేళ్ళ హస్తం.
భాతం = ప్రకాశించు
యడ్ల శ్రీనివాసరావు 26 August 2023 9:00 pm
No comments:
Post a Comment