ఏనాటిదో ఈ సమయం
• ఏనాటిదో ఈ సమయం
ఈ నాటికి వచ్చింది.
• ఏనాటిదో ఈ అనుభవం
సరికొత్తగా తాకింది.
• నింగి హంగు తో విరిసింది.
నిశి తొంగి చూస్తుంది.
• మేఘం ముత్యమై మెరిసింది
మధురం మనసు లో నిండింది.
• ఏనాటిదో ఈ సమయం
ఈ నాటికి వచ్చింది.
• ఏనాటిదో ఈ అనుభవం
సరికొత్తగా తాకింది.
• కలిసే ఓ కనకాంబరం
మెరిసే పీతాంబరం.
• సాగే ఈ సంబరం
తాకే ఆ అంబరం.
• ఏమనగలను నేనేమనగలను
కాలం తిరిగి వచ్చింద నా…
ఏదో చెప్పి వెళుతుంద నా.
• ఏమనగలను నేనేమనగలను
కలల కు కొనసాగింప నా...
ఆశల కు ఊరేగింప నా.
• ఏమనగలను నేనేమనగలను
ఏమనగలను నేనేమనగలను
• ఏనాటిదో ఈ సమయం
ఈ నాటికి వచ్చింది.
• ఏనాటిదో ఈ అనుభవం
సరికొత్తగా తాకింది.
• ఆ పొద్దు లోని తొలిపొడుపు
ఈ పొద్దు తిరిగి చూస్తున్నా …
• ఆ నాటి లోని తొలి స్పర్శ
ఈ నాడు నే అనుభవిస్తున్నా.
• ఏమనగలను నేనేమనగలను
ఎవరికి ఏమని చెప్పగలను.
• ఏనాటిదో ఈ సమయం
ఈ నాటికి వచ్చింది.
• ఏనాటిదో ఈ అనుభవం
సరికొత్తగా తాకింది.
యడ్ల శ్రీనివాసరావు 2 Aug 2023 , 11:00 pm.
No comments:
Post a Comment