వర్షం - హర్షం
• పిలిచే నను పిలిచే ఈ చినుకుల తో
జతగా తోడై నడిచే నా అడుగుల కు
వర్షం ఈ స్వప్నం.
• తనువును తాకిన చినుకులు
సిగ్గు తో నను చూస్తుంటే ...
ఆమని పాడే రాగం
ఆమెను తలపిస్తుంది.
• జలధారగ జారిన జల్లులు
చక్కిలి గిలి చేస్తుంటే ...
మండూగ చేసే నాట్యం
మెండుగా అలరిస్తుంది.
• పిలిచే నను పిలిచే ఈ చినుకుల తో
జతగా తోడై నడిచే నా అడుగుల కు
హర్షం ఈ కాలం.
• ఆడుతూ వేసే అడుగులకు
పాడుతూ తడిపే నీటి తో ...
చెలిమి గ సాగే సంగమం
చంద మై మురిపిస్తుంది.
• అధరం చేసే అల్లరిని
వదనం మోసిన మదనం తో ...
మెరుపులు చూసే తరుణం
మనసే పరవశిస్తుంది.
• పిలిచే నను పిలిచే ఈ చినుకుల తో
జతగా తోడై నడిచే నా అడుగుల కు
వర్షం ఈ స్వప్నం
హర్షం ఈ కాలం.
మండూగ = కప్ప
మదనం = సంతోషం.
యడ్ల శ్రీనివాసరావు 25 July 2023 , 8:00 PM.
No comments:
Post a Comment