జీవిత స్వరం
• సత్యమెన్నడు సతో ప్రధానం
నిత్యమెన్నడు అమోదనీయం.
• రేగుతున్న అలజడులే
మనిషి కి రజో ప్రధానం.
• ఎగిసిపడు ఉద్వేగాలే
మనసు కి తమో ప్రధానం.
• సత్యమెన్నడు సతో ప్రధానం
నిత్యమెన్నడు అమోదనీయం.
• సంబంధాల లో “సం” ఉన్నదా
ఆత్మీయత లో సుఖం దాగున్నదా ?
• అనురాగం లో శాంతి ఉన్నదా.
అనుబంధాల లో సత్యం దాగున్నదా ?
• ఉన్నది అంతా నటనే
ఆ నటన కు వేదిక జీవితం.
• సత్యమెన్నడు సతో ప్రధానం
నిత్యమెన్నడు అమోదనీయం.
• మనిషిని మనిషి తాకే కాలమిది.
మనసును మనసు సాకే సమయ మేది ?
• విలువ లేని బ్రతుకులకు
వెలుగు నింపెనా ఆస్తి పాస్తులు.
• ఆకలి కోరికలే ఆశల హరివిల్లు
మాయా మోహలే జీవన పొదరిల్లు.
• సత్యమెన్నడు సతో ప్రధానం
నిత్యమెన్నడు అమోదనీయం.
సతో = సామరస్య గుణం
రజో = కోరికల ప్రేరణ గుణం
తమో = హింసాత్మక గుణం.
సం = నిజాయితీ.
యడ్ల శ్రీనివాసరావు
30 May 2024 , 10:00 PM.
No comments:
Post a Comment