అర్పితం
• పూస ను కాను
పూస ను కాను
నీ హారం లో పూస ను కాలేను.
• పూవు ను కాను
పూవు ను కాను
నీ మాలలో పూవు ను కాలేను.
• నీ ఆజ్ఞాకారి నైనా భాగ్యం
భాగ్యం
అదియే ఈ జీవికి భాగ్యం.
• జన్మలెన్నో ఎత్తాను
కర్మలెన్నో చేసాను
తుదకు తెలుసుకున్నాను
నీవే నా తండ్రి వని ...
నీ మాటను శిరసావహించాలని.
• అక్షత నైతి
అక్షత నైతి
నీ కంట నీటి రుద్రాక్షత నైతి.
• భస్మము నైతి
భస్మము నైతి
నీ ఒంటి పూసే భస్మము నైతి.
• నీ కంఠగరళ బిందు నైన మోక్షం
మోక్షం
అది యే ఈ అల్పికి మోక్షం.
• పూజలెన్నో చేసాను
వేదనలెన్నో భరించాను
తుదకు తెలుసుకున్నాను
అవి నా కర్మల గుహ్య గతి అని.
అవి కరిగేది నీ స్మృతి తోనే అని.
• పూస ను కాను
నీ హారం లో పూసను కాను.
పూవు ను కాను
నీ మాలలో పూవు ను కాను.
• అక్షత నైతి
నీ కంట నీటి రుద్రాక్షత నైతి.
భస్మము నైతి
నీ ఒంటి పూసే భస్మము నైతి.
అక్షత = విరిగినది, జారినది.
యడ్ల శ్రీనివాసరావు 8 May 2024 10:00 pm
No comments:
Post a Comment