శివ అఘోరి
• విజృంభ డుంబ హేరంభ
ఢమ ఢమ ఢమరుక ప్రజ్వల
• ఓంకార హ్రీంకార పంచాక్షరీ
ప్రమధ గణ సేవితా.
• సరళ సుస్వర మృదు పాళీ
సంకట హర విరసిత కేళీ
• నటరాజ నాట్య రవళీ
ఆనంద పరవశ హోళీ
• రంజితా కాలే కంఠిత
భస్మ లేపిత నిశాచర కామిత
• నిర్వికల్ప నిరాకార సాకార నిఘాడ
నియంత నిశ్చల నిర్మిత
• ఝం ఝం ఝం ఝటాఝూట
గంగై బంధిత కపాల మాల
• కంఠే తాల్చిత ఘోర
ఘోర అఘోర రూపితా ౹౹శివా౹౹
🙏ఓం నమః శివాయః 🙏.
యడ్ల శ్రీనివాసరావు
28 May 2024 6:00 AM
No comments:
Post a Comment