స్థితి - గతి
• అలలై పొంగెను అంతరంగం
కలలై సాగెను జీవన రాగం.
• ఆశల హరివిల్లు ఆకాశం లో
ఊహల పొదరిల్లు కీకారణ్యం లో
• ఏకాంతం ఓ కౌశల్యం.
అది మనోభిరాముని చేరు మార్గం.
• మౌనం తో సహవాసం.
అది పరమాత్ముని చేరు సత్సంగం.
• తనువు ని మరచి న
పొందేది ఆత్మానందం.
• అలలై పొంగెను అంతరంగం
కలలై సాగెను జీవన రాగం.
• వలలై అల్లును బంధాలు
మోహలై జల్లును అనురాగాలు.
• దుఃఖాల చీకట్లు ఈ ప్రపంచం లో
మోసాల ఇక్కట్లు ఈ మాయ లోకం లో
• సమూహల కలయిక ఓ కాలక్షేపం.
అది ఎన్నో సమస్యలకు శ్రీకారం.
• మాటల తో అభినయం.
అది నటన లో ప్రావీణ్యం .
• ఆధీనం లేని మనసు
చివరకు పొందేది ధీనం .
• వలలై అల్లును బంధాలు
మోహలై జల్లును అనురాగాలు.
కౌశల్యం = నైపుణ్యం
యడ్ల శ్రీనివాసరావు 3 May 2024, 9:00pm.
No comments:
Post a Comment