దీపం - తేజం
• వెలుగుతుంది వెలుగుతుంది
దివ్యమైన దీపం.
• నిండుతుంది నిండుతుంది
చైతన్యమైన తేజం.
• ఆ దీపం పరమాత్మ
ఆ చైతన్యం శక్తి.
• చమురు వలే ఆత్మ
పరమాత్మ యను ప్రమిద లో ఒదిగింది.
• దహనం అనే సాధన తో
మోక్ష సిద్ధి ని పొందింది.
• జ్ఞానమనే వెలుగుతో
మనసు చీకటి తొలగుతుంది.
• యోగమనే శక్తి తో
బుద్ధి వికాసం కలుగుతుంది.
• వెలుగుతుంది వెలుగుతుంది
దివ్యమైన దీపం.
• నిండుతుంది నిండుతుంది
చైతన్యమైన తేజం.
• ఆ దీపం పరమాత్మ
ఆ చైతన్యం శక్తి.
• శ్రేష్ట కర్మలు చేయాలంటే
మాయకు వశం కారాదు.
• బుణాను బంధాలు తీరాలంటే
శివుని స్మృతి లో నే సాధ్యం.
• కర్మ భోగి గా కావాలంటే
నిర్వికారి గా కావాలి.
• కర్మ యోగి గా కావాలంటే
బురద తామర గా ఉండాలి.
• వెలుగుతుంది వెలుగుతుంది
దివ్యమైన దీపం.
• నిండుతుంది నిండుతుంది
చైతన్యమైన తేజం.
• శివుడు ఉండేది పరంధామము లో ...
అవతరిస్తాడు భూమి పై
కలియుగ అంత్యమున.
• మనసు తో ప్రేమ గా
పిలిచిన పలుకుతాడు.
మీ సేవ కై వచ్చాను అంటాడు.
• వెలుగుతుంది వెలుగుతుంది
దివ్యమైన దీపం
• నిండుతుంది నిండుతుంది
చైతన్యమైన తేజం.
కర్మ భోగి = శరీరానికి ఏ అవస్థ వచ్చినా అనగా అనారోగ్యం , దుఃఖం, కష్టం , బాధ. ఆ సమయంలో మనసు ని పూర్తిగా ఆత్మ స్థితి లో ఉంచగలిగి , అంతిమ క్షణాల్లో శివుని పై ధ్యాసతో శ్వాస విడవడం కర్మ భోగం. ఈ స్థితి పొందాలంటే నిర్వికారిగా కావాలి, అనగా మనసు అన్ని వికారాలకు అతీతం గా అవడం.
కర్మ యోగి = భౌతిక ప్రపంచంలో శరీరం తో అన్ని కర్మలు ఆచరిస్తూ, అంతరంగం లో దేని మీద మోహం లేకుండా సన్యాసి తత్వం తో జీవించడం. తామర పువ్వు కలుషితమైన నీటిలో ఉంటూ, పరిశుభ్రం గా ఉంటుంది, ఆ విధంగా జీవించడం కర్మ యోగం.
కర్మ భోగం, కర్మ యోగం జ్ఞాన యోగ సాధన తో సాధ్యం.
యడ్ల శ్రీనివాసరావు. 9 Apr 2024 , 9:00 pm.
No comments:
Post a Comment