Monday, April 8, 2024

483. ఆమని


ఆ మ ని



• ఆగమేఘాల తో    వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది    వినమని.


• హావభావాలతో    రాలాయి

  ఆకులు

  కొత్త  చిగురు    కోసం.

• నింగి లో    ఎగిరాయి

  హంసలు

  సరికొత్త  లోకం   కోసం .


• మంచు తెరలు  

  తుడిచింది  ...   ఈ  కాలం.

  రంగులతో   చిందులేసింది   నా మనసు.

• పూల  పరికిణీలు   

  తొడిగింది    ...   ఈ వసంతం.

  హంగులతో   గెంతులేసింది  నా  వయసు.


• ఆగమేఘాల తో   వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది   వినమని.


• పైరు గాలి    పలకరింపు తో

  పసితనం    పొంగింది.

• కోడెకత్తె     చిలకరింపు తో

  ఈడుతనం    చిందింది.


• షడ్రుచుల   కలయిక  లో   

  భవ బంధాలు   నిండాయి.

• రుచులకు     ఆహార్యం గా 

  భావోద్వేగాలు   నిలిచాయి.


• ఆగమేఘాల తో    వచ్చింది    ఆమని.

  కోకిల రాగాలు      పలికింది    వినమని.

• ప్రకృతి లో     పెనవేసుకుంది    ఉగాది.

  దాసుడి   రాతతో    నేడు   మేల్కొంది.


కోడెకత్తె  = పడుచు యువతి.


యడ్ల శ్రీనివాసరావు .  2 Apr 2024 9:30 pm 


No comments:

Post a Comment

790. బొమ్మల కొలువు

  బొమ్మల కొలువు ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ మాత్రే నమః  • లక్ష్మి గాంచిన  కళలతో  నిండిన    లక్షణమైన   కొలువు    ఈ బొమ్మల  కొలువు . • పల్లె ...