Wednesday, April 10, 2024

485. ఓ వయ్యారి

 

ఓ వయ్యారి



• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి

• పరువాల   పరికిణీ తో

  పైరు గట్టు నెగిరే   పొన్నారి.


• ఓ  వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి. 


• జడగంటల    జాజి మల్లె

  కస్సు మనే     కొండ మల్లె

  కోడె వయసు    కాడ మల్లె

  తైతక్క లాడే    తీగ మల్లె


• తూరీగ     నడుము తో

  తుర్రు మనే    లేడిపిల్ల.

  బరువెక్కిన    బుగ్గ లతో

  సిగ్గు లొలుకు   సీమపిల్ల.


• ఓ   వయ్యారి  వయ్యారి

  వంగపండు    చిన్నారి


• పంట  పంపు   బోదెకాడ

  జలకమాడే    కొర్రమీన.

  పట్టుకుంటే    జారుతావు 

  పైటకొంగు    విసురుతావు .


• గడ్డివాము    ఆటలలో

  గోల చేసే      గయ్యాళి.

• బొడ్డు కింద   చీర దోపి

  చిందు వేసే    బొమ్మాళి.


• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి.

• పరువాల    పరికిణీ తో

  పైరు గట్టు  నెగిరే   పొన్నారి.


యడ్ల శ్రీనివాసరావు  4 Apr 2024 8:00 PM


No comments:

Post a Comment

700. వ్యక్తుల నుండి భావోద్వేగ స్వతంత్ర్యత

  వ్యక్తుల నుండి భావోద్వేగ  స్వతంత్ర్యత  భావోద్వేగాలు  సంతోషం, విచారం, కోపం, భయం, ప్రేమ, శత్రుత్వం . • మనకున్న బంధాలలో, కొన్ని బంధాలపై మనం భ...