Friday, May 5, 2023

354. ప్రకృతి కి మనసు ఉండదా

 

ప్రకృతి కి మనసు ఉండదా



• అందాలు    అందాలు

  చందాలు    చందాలు.

  అందమైన    ప్రకృతి లో 

  అంతు  లేని   అందాలు.

  రేయి పగలు   ఆదమరచి 

  పెన  వేసుకున్న  చందాలు.


• అల  తాకిన   శిలకు

  అందమే  కాని   ఆనందం  తెలియునా.

• అలుపెరుగని   సాగరం కి

  ఘోష యే   కాని   శాంతం  ఎరుగదు.


• నిశి    నిండిన  చీకటి కి

  మౌనమే కాని   మల్లెల  పరిమళం  తెలియునా.

• తొలి   పొడుపు  భానుని కి

  భగభగ లే   కాని పిల్ల  గాలులు  ఎరుగడు.


• ఎందుకో   ఎందుకో …. ఇలా

  ప్రకృతి కి  మనసంటూ  ఉండదా ...

  అందాలకు  ఆనందం  ఎవరిస్తారు.


• అందాలు    అందాలు

  చందాలు    చందాలు.

  అందమైన    ప్రకృతి లో 

  అంతు  లేని   అందాలు.

  రేయి  పగలు   ఆదమరచి 

  పెన   వేసుకున్న  చందాలు.


• మట్టిలో ని   మలినాని  కి

  కలుషితమే   కాని   మాణిక్యం   తెలియునా

• సరసు లో ని    నీటి  కి

  దుర్గంధమే  కాని   కలువందం  ఎరుగదు.


• హరివిల్లు లో    రంగులకు

  శూన్యమే  కాని   సప్త వర్ణాలు  ఎరుగవు.

• పాలపిట్ట   అరుపు లో   ఆక్రందనే  

  కాని   రాగం   ఉందని   తెలియదు.


• ఎందుకో    ఎందుకో ….  ఇలా

  ప్రకృతి కి  మనసంటూ  ఉండదా ...

  అందాలకు  ఆనందం  ఎవరిస్తారు.


• అందాలు    అందాలు

  చందాలు     చందాలు.

  అందమైన   ప్రకృతి లో 

  అంతు   లేని   అందాలు.

  రేయి పగలు   ఆదమరచి 

  పెన  వేసుకున్న  చందాలు.


యడ్ల శ్రీనివాసరావు 6 May 2023 9:00 am.












No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...