ఏడడుగుల బంధం
• ఏడడుగుల బంధం
ఏనాటి దో ఈ సంబంధం.
• తెలియని మనసు ల కిది
సరికొత్త శ్రావ్యం.
• తెలిసిన మనుషుల కిది
ఓ జీవిత గ్రంధం.
• ఏడడుగుల బంధం
ఏనాటి దో ఈ సంబంధం.
• ఎన్నో ఆశలతో
అడుగులు వేసింది ఈ బంధం.
• మరెన్నో ఊహలలో
ఊయలూగింది ఈ అనుబంధం.
• నా కలయిక చెప్పింది
ఇది ఓ జీవన తూకానికి కారణమని.
• ఈ కాలం చెప్పింది
ఈ బంధం ఓ బుణానికి జరిమానా అని.
• ఏడడుగుల బంధం
ఏనాటి దో ఈ సంబంధం.
• తెలియని మనసు ల కిది
సరికొత్త శ్రావ్యం.
• తెలిసిన మనుషుల కిది
ఓ జీవిత గ్రంధం.
• గడచిన జన్మలకు ఇది
కొనసాగింపు జీవితమని.
• అనుభవించేందుకు కాదిది …
ఎన్నో అనుభవాల జన్మ అని.
• దైవం తెలిపింది ... ఆధారం చూపింది.
• ఏడడుగుల బంధం
ఏనాటి దో ఈ సంబంధం.
• బుణాను బంధాలెన్నో
నేడు కలుస్తున్నాయి.
• తీరినాక అవి దూరం
అయి పోతున్నాయి.
• మానవ బంధాల తో ఈ మనిషి కి
మిగిలింది నిస్తేజము.
• దైవాను బంధం తో ఈ మనసు కి
కలిగింది ఉత్తేజము.
• ఏడడుగుల బంధం
ఏనాటి దో ఈ సంబంధం.
• తెలియని మనసు ల కిది
సరికొత్త శ్రావ్యం.
• తెలిసిన మనుషు ల కిది
ఓ జీవిత గ్రంధం.
యడ్ల శ్రీనివాసరావు 27May2023. 6:00 PM
No comments:
Post a Comment