ముద్దు గుమ్మ
• చెంగావి చీర లో
చెంగున గెంతే గుమ్మ.
• చామంతి రైక లో
తుర్రున జారే బొమ్మ.
• ఎక్కడికి పోతావే
నా ముద్దు గుమ్మ.
• నిను ఎక్కడ వెతకాలే
నా చిట్టి బొమ్మ.
• రివ్వున ఎగిరే గాలి లో
రివట లాంటి నీ సొగసు
రై రై అంటూ నను మీటి పోతుంటే
ఏదో కలవరం ...
• ఏమిటో … అది ఏమిటో.
• ఓ నీలి కన్నుల రాణి
నిలవ నీ కున్నావు కానీ.
• నీ నడుము వొంపు లో బాణి
జారి బయటకొచ్చింది వోణి.
• ఎందు కోసమో … ఎవరి కోసమో.
• చెంగావి చీర లో
చెంగున గెంతే గుమ్మ.
• చామంతి రైక లో
తుర్రున జారే బొమ్మ.
• ఎక్కడికి పోతావే
నా ముద్దు గుమ్మ.
• నిను ఎక్కడ వెతకాలే
నా చిట్టి బొమ్మ.
• జివ్వ నిపించే అందం లో
హంస లాంటి నీ రూపం
రా రా అంటూ నన్నే సైగ చేస్తుంటే
ఏదో పరవశం ...
• ఏమిటో … అది ఏమిటో.
• ఓ సన్నజాజి పూబోణి
కలవ నీ కున్నావు కానీ.
• నీ పెదవి సొంపు లో మణి
రత్నమై జారింది రాగిణి.
• ఎందు కోసమో … ఎవరి కోసమో.
• చెంగావి చీర లో
చెంగున గెంతే గుమ్మ.
• చామంతి రైక లో
తుర్రున జారే బొమ్మ.
• ఎక్కడికి పోతావే
నా ముద్దు గుమ్మ.
• నిను ఎక్కడ వెతకాలే
నా చిట్టి బొమ్మ.
యడ్ల శ్రీనివాసరావు 11 May 2023 3:00 PM.
No comments:
Post a Comment