Monday, May 1, 2023

352. కాలసమీరం

 

కాలసమీరం



• ఎప్పుడూ  లేను     ఎన్నడూ   లేను

   ఏమిటో   ఎగురుతున్నట్లు    ఉంది

   అలా అలా    సమీరం లా.


• గువ్వను   కాను  …   గోరింకను   కాను

  హంసను   కాను …   రాజహంస   అసలే  కాను.


• ఎగిరే ది    ఎవరు    

  నా లోని   మనసా   లేక   నను  మోసేటి  వయసా.

  ఎవరు   చెపుతారు   నాకు

  ఎలా     చెపుతారు    నాకు.


• ఎప్పుడూ    లేను      ఎన్నడూ  లేను

  ఎక్కడో    తేలుతున్నట్లు   ఉంది

  ఇలా   ఇలా    కమనీయం గా.


• మేఘం   కాను   …   నీలి   మేఘం   కాను

  తరంగం  కాను   …   అంతరంగం  అసలే   కాను.


• తేలుతున్నది    ఎవరు   

  నా లోని   మనసా   లేక   నను  మోసేటి  వయసా.

  ఎవరు   చెపుతారు    నాకు

  ఎలా      చెపుతారు   నాకు.


• ఈ కాలం    వాహనమై    ఆవహించింది   నన్ను.

  అడగక నే     తీసుకెళుతుంది

  ఎటో  …  ఎటో   …  ఎక్కడికో.


• ఈ పయనం    అధ్బుతమై   మలిచింది  నన్ను.

  అడగక నే     చూపుతోంది

  ఎన్నో  …   ఎన్నో   …  ఎన్నెన్నో.

 

• మత్తుగా   లేదు   కాని    గమ్మత్తుగా  ఉంది

• వింతగా    లేదు   కాని    కొంగొత్త గా  ఉంది.

 

• ఎప్పుడూ  లేను       ఎన్నడూ  లేను

  ఏమిటో    ఎగురుతున్నట్లు    ఉంది

  అలా   అలా     సమీరం లా


• ఎప్పుడూ   లేను      ఎన్నడూ  లేను

  ఎక్కడో     తేలుతున్నట్లు    ఉంది

  ఇలా   ఇలా    కమనీయం గా



యడ్ల శ్రీనివాసరావు 1 May 2023 2:30 PM.










No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...