శ్రీ సూర్య నారాయణ
• నారాయణ నారాయణ
జగము ను స్థితము చేసే
శ్రీ మన్నారాయణ సృష్టి *పారాయణ
*హర్షవల్లి న *సూతుడి గ
వెలుగైన క్షేత్ర నారాయణ.
• ఉష్ణ మై ప్రాణము పోసి
సర్వ జీవుల యందు ఆయు వై నిలిచావు.
• భగ భగ మండే భానుడి వై
శత్రు వధ చేసి రక్షకుడి వైనావు.
• ధర్మార్థ కామ మోక్షముల నే
చతుర్భుజముల తో జగన్నాధుడైనావు.
• *క్రీగంట నవ్వుతో *శ్రీకంఠ నాధుని చే
వైభవోపేతుడైన వైకుంఠ నారాయణ
శ్రీ లక్ష్మి నారాయణ.
• నారాయణ నారాయణ
జగము ను స్థితము చేసే
శ్రీ మన్నారాయణ సృష్టి *పారాయణ.
• హర్షవల్లి న కొలువై హర్షమును పంచే
శ్రీ సూర్య నారాయణ.
• కిరణముల శక్తి తో *కరణ ధారణ చేసే
శ్రీ సూర్య నారాయణ
పాహిమాం రక్షమాం.
*పారాయణ = కార్య సమాప్తి చేయు వాడు.
*హర్షవల్లి = అరసవల్లి గ్రామం, సంతోషాల నిలయం.
*సూతుడు = సూర్యుడు
*క్రీ గంట = కనులు క్రిందికి సగం మూసి తెరచినట్లు
*శ్రీకంఠ నాధుడు = శివుడు.
*కరణ ధారణ = కార్యము(పని) సిద్ధించు
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 30 Apr 2023 8:00 pm
No comments:
Post a Comment