జడి ఎందుకో
• జడి ఎందుకే జవరాల జడి ఎందుకే
అలజడి తో తడబడి తే *ఒరవడి పోతుందే
స్థిరము తో నిలబడితే నే స్థితి గతుల వెలుగు
అస్థిరము గయితే చివరికి ఆందోళనే మిగులు.
• జడి ఎందుకే జవరాల జడి ఎందుకే
అలజడి తో తడబడి తే *ఒరవడి పోతుందే
మది ని రాయిగ చేస్తే రత్నమై మెరవదా
వ్యధ ను మౌనం చేస్తే దగ్దమే కాదా.
• ఆటలు పాటలు ఆటుపోటు లయినంత లో
సాగరం లో అలలకు ఆనందమే కరువా.
• జడి ఎందుకే జవరాల జడి ఎందుకే
అలజడి తో తడబడి తే *ఒరవడి పోతుందే.
బుద్ధి సరి ఉంటే నే మాయ భయపడేది
యుక్తి సరి ఉంటే నే శక్తి నిలబడేది.
• కాగల కార్యం గంధర్వుడే చేస్తాడు
భారతాన్ని మించిన మనుధర్మమే లేదు.
• జడి ఎందుకే జవరాల జడి ఎందుకే
అలజడి తో తడబడి తే *ఒరవడి పోతుందే
జడి పెరిగితే తడి ఆరదు … కంటతడి అరదు.
జడి = బాధ, దుఃఖం
*ఒరవడి. = కట్టుబాటు, ఆచారం, మర్యాద, ఆదర్శం.
యడ్ల శ్రీనివాసరావు 14 Apr 2024 , 6:00 AM.
No comments:
Post a Comment