చైత్ర ఫౌర్ణోదయం
• ఈ ఉదయం పూర్ణోదయం
ఉగాది తెచ్ఛిన తొలి సంపూర్ణోదయం
• పౌర్ణమి చంద్రుని కాంతితో
నేడు సూర్యుని రూపం పరిపూర్ణం.
• సూర్యచంద్రుల కలయిక
ఈ చైత్ర పౌర్ణమి విశేషం.
• ఆత్మ మనసు ల
సమతుల్యం దీని ప్రాధాన్యం.
• విశ్వ వలయం లో ఇది
అపురూప సంయోగం.
• ప్రకృతి పురుష
పుంగవులు కి *తలమానికం.
• ఈ ఉదయం పూర్ణోదయం
ఉగాది తెచ్ఛిన. తొలి సంపూర్ణోదయం.
• విష్ణు సహస్రనామ పఠనం
దుఃఖ సంకట హరణం.
• సత్యదేవుని స్మరణం
సకల కార్యసిద్ధి కి సోపానం.
• శివుని ఆదేశం తో బ్రహ్మ విశ్వాన్ని
సృష్టించిన మాసం చైత్రం.
• గ్రహములను అనుసంధాన
కాలం ఈ పుణ్య మాసం.
• పాప కర్శల విముక్తి కై
తపస్సు చేసిన ఇంద్రుని కి
కదంబ వృక్షం చెంతన
నేడే జరిగెను శివుని సాక్షాత్కారం.
• మధుర మీనాక్షి ఆలయం
ఈ వృత్తాంతపు సన్నిధానం.
• ఈ ఉదయం పూర్ణోదయం
ఉగాది తెచ్ఛిన తొలి సంపూర్ణోదయం
• పౌర్ణమి చంద్రుని కాంతితో
నేడు సూర్యుని రూపం పరిపూర్ణం.
• ఆత్మలో చీకటి నశించే
నేటి చంద్రకాంతి శక్తి తో.
• జ్ఞానం వెలుగై నిండే
నేటి సూర్య కాంతి శక్తి తో.
• చిత్ర గుప్తుని కి పూజలు
చేసే ఏకైక పర్వ దినం.
• యమధర్మరాజు పాపులపై
కరుణ చూపే మోక్ష దినం.
• ఈ ఉదయం పూర్ణోదయం
• ఉగాది తెచ్ఛిన తొలి సంపూర్ణోదయం
*తలమానికం = శిరస్సు మీద ఉంచుకునే దివ్యమైన మణి
ఈ రోజు చైత్ర పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. చంద్రుని యొక్క కాంతి సూర్యుని పై పడి ప్రభావితం అయ్యే రోజు. ఈ విధంగా ఒక్క చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే జరుగుతుంది. చంద్రుడు అంటే మనసు, సూర్యుడు అంటే ఆత్మ. మనసు ఆత్మను చైతన్యం చేసే అద్భుతమైన శక్తి చంద్రుని యొక్క కాంతి ద్వారా సృష్టి లో సకల జీవుల కు చేరుతుంది.
అదే విధంగా ఇంద్రుడు తాను తెలిసి తెలియక చేసిన పాపము లకు విముక్తి కోసం బృహస్పతి ని అడుగగా,…. బృహస్పతి చెప్పిన సలహ ప్రకారం కదంబ వృక్షం క్రింద తపస్సు చేస్తాడు ఇంద్రుడు. ఆ వృక్షం క్రింద శివుడు ఉండి రోజు రోజుకు ఇంద్రుని యెక్క పాపాలను శివుడు కరిగించి , నేటి దినమైన చైత్ర పౌర్ణమి నాడు శివుడు ఇంద్రుని కి శివలింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇది జరిగిన ప్రదేశమే నేడు మధురై లో మీనాక్షి అమ్మవారి దేవాయలయ ప్రాంగణ ప్రదేశం.
ఈ రోజు విష్ణు సహస్రనామ పఠనం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, కధ వినడం, స్మరించడం సాయంత్రం వేళలో అంటే చంద్రోదయ సమయంలో చేస్తే పాపాలు నశించే మార్గం తెలిసి, జ్ఞానం లభిస్తుంది.
హనుమంతుని జయంతి చైత్ర పౌర్ణమి రోజున జరుగుతుంది .
కాంచీపురం ఈ సమస్త భూమండలానికి గరిమనాభి స్థానం. కంచిలో 108 దేవాలయాలు కలవు. చిత్ర గుప్తుని కి కేవలం కంచిలో మాత్రమే ఆలయం కలదు. చిత్రగుప్తుని కి కంచిలో నేడు విశేషమైన పూజలు చేసే ఏకైక దినం చైత్ర పౌర్ణమి. ఎప్పుడూ కఠినం గా శిక్ష లు అమలు చేసే యమధర్మరాజు , నేటి దినమున మాత్రమే కరుణ చూపిస్తాడు. ఇది అంతా శివుని అనుగ్రహం వలన చంద్రుని కాంతి శక్తి తో సాధ్యం అయింది.
ఉగాది ఆరంభం నుంచి బ్రహ్మ చే సృష్టి ని కొత్త గా స్థాపింప బడుతుంది. మరియు గ్రహాలను అనుసంధానం చేసే పవిత్ర మాసం చైత్ర మాసం.
నదీ స్నానం, పూజ, ధ్యానం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది మానవుని కి.
ఇది గ్రహించి అమలు చేసుకున్న వారు ధన్యులు.
ఇది అంతయు విశ్వం లో ని శక్తి వలన జరుగుతుంది. ఆ శక్తి తో నే సకల జీవులు, మానవుడు జీవిస్తాడు. మనిషి కూడా ఈ విశ్వ శక్తి తో అనుసంధానం ధ్యానం ద్వారా అయినపుడు అద్బుతాలు జరుగుతాయి.
యడ్ల శ్రీనివాసరావు 6 Apr 2023. 3:30 AM.
No comments:
Post a Comment