జిగురు మట్టి
• మట్టి మట్టి నల్ల మట్టి నల్లనైన మట్టి
గోదావరి కడుపులో జీవించే జిగురు మట్టి.
• విత్తుల ను పెంచి పెద్ద చేసేటి *ఉట్టి
వృక్షాల ను నిలిపేను తన కడుపున కట్టి.
• మట్టి మట్టి నల్ల మట్టి నల్లనైన మట్టి
గోదావరి కడుపులో జీవించే జిగురు మట్టి.
• విగ్రహల రూపం గా మారేను మనిషి చేత పట్టి
నున్న గ నాణ్యమై ఆరేను ఎండ బెట్టి.
• లక్కపిడత బొమ్మల కై నలిగేను ప్రాణం పెట్టి
పిల్లల మనసు లలో నిలిచే ను జై కొట్టి.
• మట్టి మట్టి నల్ల మట్టి నల్లనైన మట్టి
గోదావరి కడుపులో జీవించే జిగురు మట్టి.
• చేల గట్ల కోసం సమిధ లా వెలిగేను చిట్టి
ఆదమరచి అందు అడుగేసిన లేపేను తట్టి.
• ప్రతి ఇంటా మొక్క కి కొలువయ్యేను తొట్టి
వరద లో కరిగి పోయి మిగిలెను అంతా *వట్టి.
• మట్టి మట్టి నల్ల మట్టి నల్లనైన మట్టి
గోదావరి కడుపులో జీవించే జిగురు మట్టి.
• పావు వంతు భూగోళం నిండేను అంతా చుట్టి
చివరికి సర్వ జీవులు కలిసే నీలో తిరిగి రానట్టి.
*ఉట్టి = మట్టితో చేసి మట్టి నింపినది.
*వట్టి = నిష్ప్రయోజనం, ఏమీ లేకుండా
యడ్ల శ్రీనివాసరావు 5 Apr 2023 4:00 AM.
No comments:
Post a Comment