మధుర క్షణం
• ఈ " క్షణం " నీకై పుట్టింది
మరు క్షణం నన్నే తట్టింది
తక్షణం ఏదో అయ్యింది.
• ఏమిటో ఈ వింత
ప్రతి క్షణం ఎందు కీ కలవరింత.
• ఏనాటి దీ పులకరింత
అను క్షణం వెంటాడుతుంది మనసంతా.
• చెప్పవే కాలమా
మౌనంగా నిలిచిన సాక్ష్యమా.
• చూపవే ప్రేమమా
ఆశల హరివిల్లు కి ఆధారమా.
• ఈ " క్షణం " నీకై పుట్టింది
మరు క్షణం నన్నే తట్టింది
తక్షణం ఏదో అయ్యింది.
• గంధం పూసిన ఓ *కుందనమా
నీ మెరుపు లో నేను పరిమళం కానా.
• పాశం వేసిన ఓ ప్రణయమా
నీ మమత లో నేను ప్రియతమం కానా.
• ఏమిటో ఈ వింత
ప్రతి క్షణం ఎందు కీ కలవరింత.
• ఏనాటి దీ పులకరింత
అను క్షణం వెంటాడుతుంది మనసంతా.
• రూపం తెలియని స్వరూపమా
ఆనందం నీ చిరునామా.
• కాలం చెప్పని కమనీయమా
ఆస్వాదన నీ రంజనమా.
• మార్గం చూపని మనోగతమా
నిరీక్షణ నీ నివేదనమా.
• ఏమిటో ఈ వింత
ప్రతి క్షణం ఎందు కీ కలవరింత.
• ఏనాటి దీ పులకరింత
అను క్షణం వెంటాడుతుంది మనసంతా.
• ఈ " క్షణం " నీకై పుట్టింది
మరు క్షణం నన్నే తట్టింది
తక్షణం ఏదో అయ్యింది.
కుందనము = బంగారం , స్వర్ణం.
యడ్ల శ్రీనివాసరావు 24 Apr 2023 , 12:00 PM.
No comments:
Post a Comment