సంసార సంగీతం
• సరిగమల తాళం నా వయసు కు శ్రావ్యం
హిందోళ రాగం నా మనసు కు ప్రాణం.
• శృతి లయల పల్లవి తో
అయింది జీవితం సింధూరం.
తకదిమిల తానం తో
మోగింది అంబరం సంబరం.
• సరిగమల తాళం నా వయసు కు శ్రావ్యం
హిందోళ రాగం నా మనసు కు ప్రాణం.
• సంసారం కుడి ఎడమ లై
దోబూచు లా టాడుతు ఉంటే
గతి తప్పిన తాళం లా
*మేళం అవుతుంది గందరగోళం.
• సరిగమల తాళం నా వయసు కు శ్రావ్యం
హిందోళ రాగం నా మనసు కు ప్రాణం.
• జీవస్వరాలు రస రంజన మైనా
లయం కాని భావాలన్నీ
శృతి తప్పిన గానం లా
తాళిని చేస్తున్నాయి ఎగతాళి.
• సరిగమల తాళం నా వయసు కు శ్రావ్యం
హిందోళ రాగం నా మనసు కు ప్రాణం.
• గమకముల ఆధిపత్యం తో
సంసారమే ఓ సంగీతం.
ఎగుడు దిగుడు శృతి రేఖలన్నీ
అష్ట వంకర జీవన తరంగాలు.
• సరిగమల తాళం నా వయసు కు శ్రావ్యం
హిందోళ రాగం నా మనసు కు ప్రాణం.
* మేళం = కలయిక
యడ్ల శ్రీనివాసరావు 27 Apr 2023 9:00 pm.
No comments:
Post a Comment