నవ జీవన వేదం
• కనులు చెప్పే మాటలతో
మనసు తేలికవుతుంది ...
భావం ఓ రాగం అనురాగం.
• వ్యధలు మాసిన సమయం లో
ఎద ఎగసి ఎగసి పడుతుంది ...
భావం ఓ గీతం సంగీతం.
• మౌనం వేసే అడుగుల కు
హృదయం హారతి నిస్తుంటే
దూరం తెలియని ఈ దిక్కులకు
వెలుగే దారి నిస్తుంది.
• ఊసులు చెప్పని భాసలు
ఊహలు దాటి ఎగిరిపోతే
రెక్కలు విడిచిన పక్షి
వెన్నెల తీరం తాకింది.
• మధురం నింపిన కాలం
సుమధురంగా తోడవుతుంది ...
భావం ఓ *తానం *సనాతనం.
• ఆశలు కలిగిన అనుభవాలు
ఆనందంగా ఆవిరైపోయాయి ...
భావం ఓ *పల్లవి జీవనపల్లవి.
• *ఉమంగ ఉత్సాహాలతో
ఉరకలు వేస్తుంది శేష కాలం.
అది సరికొత్త లోకానికి
ద్వారం తెరచిన ఆహ్వానం.
• తావే లేని *తమకంతో
తకదిమి బాజాల మేళం
అదే నవజీవన వేదం
మనసు కార్యానికి సఫలం.
*తానం = మెరుగుదల యొక్క రూపం.
*సనాతనం = శాశ్వతం, కాలానికి అతీతం.
*పల్లవి. = పాట సాహిత్యంలో తిరిగి పదే పదే చెప్పేది.
*ఉమంగ = ఉవ్విళ్లూరించె సంతోషం
*తమకం = మోహం, కోరికలు.
యడ్ల శ్రీనివాసరావు 7 Apr 2023 10:00 pm
No comments:
Post a Comment