వచ్చాడండి శివుడు
• వచ్ఛాడండి వచ్చాడు
శివుడే *సఖుడై వచ్చాడు
సంగమ యుగాన వచ్చాడు
జనుల కోసమే ఉన్నాడు.
• వేదన రోదన లన్ని ….
హ ...
మన వేదన రోదన లన్ని
తనకే అర్పణ మిమ్మని అడిగాడు.
ప్రతిగా ...
తన నే స్మృతిని చేయమని అడిగాడు.
సుఖ సంతోషాలను ఇస్తానని అన్నాడు.
• వచ్ఛాడండి వచ్చాడు
శివుడే *సఖుడై వచ్చాడు
సంగమ యుగాన వచ్చాడు
జనుల కోసమే ఉన్నాడు.
• పాప భారాల తో
పెదవి మెదప లేని
దుఃఖ పీడుతుల కు
అభయం ఇచ్ఛుట కొచ్చాడు.
• అంధకారం తో
మాయ కు వశమై
విల విల లాడే
పిల్లల రక్షణ కోసం వచ్చాడు.
• వచ్ఛాడండి వచ్చాడు
శివుడే తండ్రిగా వచ్చాడు
కలి అంత్య కాలమున వచ్చాడు
స్వర్గ స్థాపనకు వేచి ఉన్నాడు.
• జ్ఞానము తోను
యోగము చేయుట చెపుతాడు.
పాప కర్మలు కరుగుటకు
మార్గం ఏమిటో చూపిస్తాడు.
• ఆది సనాతన దేవి దేవత
ధర్మం తిరిగి స్థాపిస్తాడు.
సత్యయుగపు
స్వర్గ పాలన ను అందిస్తాడు.
• వచ్ఛాడండి వచ్చాడు
శివుడే రక్షకు డై నిలిచాడు
కళ్యాణ కారి యై ఉన్నాడు.
సఖుడు = సహాయకారి , ఇష్టుడు , ఆప్తుడు
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 13 APR 2023 , 10:00 PM.
No comments:
Post a Comment