పెట్టకు బాధ ఎవ్వరిని
• పెట్టకు మిత్రమా పెట్టకు
బాధ పెట్టకు ఎవ్వరిని.
• ఇవ్వకు సోదరా ఇవ్వకు
దుఃఖ మివ్వకు ఎవ్వరికి.
• మనిషి కి తగిలిన బాధ
మట్టి లో కలిసి సమసి పోతుంది.
• మనసు కు తగిలిన బాధ
జన్మలు తిరిగి నిన్నే చేరుతుంది.
• పెట్టకు మిత్రమా పెట్టకు
బాధ పెట్టకు ఎవ్వరిని.
• ఇవ్వకు సోదరా ఇవ్వకు
దుఃఖ మివ్వకు ఎవ్వరికి.
• చేసిన పాపం పుణ్య కార్యాల తో పోదు
అనుభవిస్తేనే తీరుతుంది.
• స్వర్గం నరకం ఎక్కడో లేవు
సుఖదుఃఖాలు గ నీ తోనే ఉన్నాయి.
• మాటలతో మభ్య పెట్టకు.
చేతలతో చేటు చేయకు.
చూపులతో చండాలు డవ్వకు.
విలువలు దిగజారి జీవించకు.
• పెట్టకు మిత్రమా పెట్టకు
బాధ పెట్టకు ఎవ్వరిని.
• ఇవ్వకు సోదరా ఇవ్వకు
దుఃఖ మివ్వకు ఎవ్వరికి.
• కష్టాలను ఇష్టాలు గ మార్చుకో
నీ ధైర్యం దారవుతుంది.
• స్థితి గతులను ఆధీనం చేసుకో
నీ శక్తి వెలుగవుతుంది.
• ఆలోచన అలజడి కానివ్వకు
నీ కార్యం సిద్ధిస్తుంది.
• చిరునవ్వును కల్మషం కానివ్వకు
నీ భాగ్యం వరిస్తుంది.
• మలినాలు తయారు చేసే శరీరానికి
కామ వికారాల బరువు అవసరమా ...
• అనారోగ్యపు దేహ కర్మాగారానికి
ఆడంబరాలు ఆయువు నిస్తాయా ...
• నిలకడ లేని బుద్ధి కి
నీరాజనాలు అందని ద్రాక్ష లే.
• మనసు ను గెలవాలంటే
మాయ మార్మాలతో సాధ్యం కాదు లే.
• పెట్టకు మిత్రమా పెట్టకు
బాధ పెట్టకు ఎవ్వరిని.
• ఇవ్వకు సోదరా ఇవ్వకు
దుఃఖ మివ్వకు ఎవ్వరికి.
• మనిషి కి తగిలిన బాధ
మట్టి లో కలిసి సమసి పోతుంది.
• మనసు కు తగిలిన బాధ
జన్మలు తిరిగి నిన్నే చేరుతుంది.
యడ్ల శ్రీనివాసరావు 2 April 2023 3:00 pm.
No comments:
Post a Comment