పాపభారం
• తల పైన పాపము
ఇల లోన భారము.
• ఎదగ లేని మనిషి కి
ఇదే ఒక మడుగు.
• మెరుగు లేని మనసు కి
ఇదే ఒక మరుగు.
• తల పైన పాపము
ఇల లోన భారము.
• బుద్ధి యోగముయితేనే
తొలుగుతుంది ఈ హేయము.
• కర్మ శుద్ధి అయితేనే
కరుగుతుంది ఈ దీనము.
• దేహం వికారాల పుట్ట గ కొలువై నపుడు
జీవం విచారాల దిట్ట గ నెలవు .
• ఇరుగు పొరుగు వారితో కాలక్షేపం
శక్తి హీనమయ్యేటి మానసిక చపలం.
• అసత్యపు మాటలు ఉనికి ని పోగొట్టి
విలువను కోల్పోయే అగాధపు అంచులు.
• వ్యర్థమైన అలవాట్లు మరణాన్ని స్వాగతించి
నరకానికి దారి చూపే రాచరికపు బాటలు.
• తల పైన పాపము
ఇల లోన భారము.
• బుద్ధి యోగముయితేనే
తొలుగుతుంది ఈ హేయము.
• కర్మ శుద్ధి అయితేనే
కరుగుతుంది ఈ దీనము.
మడుగు = గొయ్యి
మెరుగు = ప్రకాశం
మరుగు = మురికి, రొచ్చు
హేయము = పాపం, చేయకూడనిది
దీనము = దారిద్ర్యం
చపలం = నీచం.
యడ్ల శ్రీనివాసరావు 15 May 2023 7:00 pm
No comments:
Post a Comment