గోదావరి గలగలలు
• గోదావరి గలగలలు
గుండెల్లో తకదిములై
• తెరచాప రెపరెపలు
కన్నుల్లో అలజడులై
• సాగేను సరికొత్త పయనం
ఏ నాటిదో ఈ వయనం
• ఆటుపోటు అలలు
ఊయలయిన తరుణం
• నదిలోతు అగాధం
నిధి నిచ్ఛిన సమయం
• సాగే సాగే సరికొత్త పయనం
ఏ నాటిదో ఈ నవోదయం.
• ఈ గాలి నాది … ఈ నీరు నాది
ఈ శ్వాస నాది … ఈ ఆశ నాది
నను తాకిన అణువణువు
నాది నాది …. నాదే నాది.
నాది నాది …. నాదే నాది.
• గోదావరి గలగలలు
గుండెల్లో తకదిములై
• తెరచాప రెపరెపలు
కన్నుల్లో అలజడులై
• సాగేను సరికొత్త పయనం
ఏ నాటిదో ఈ వయనం
• మబ్బుల్లో సూర్యుడు
మనసు లో సరిగమలై
• సిగ్గు ల్లో చంద్రుడు
సొగసు లో కితకితలై
• సాగే సాగే ఈ సరికొత్త పయనం
ఏనాటిదో ఈ శుభోదయం
• ఈ గాలి నాది … ఈ నీరు నాది
ఈ శ్వాస నాది … ఈ ఆశ నాది
నను తాకిన అణువణువు
నాది నాది …. నాదే నాది.
నాది నాది …. నాదే నాది.
• జన్మల్లో నిలిచిపోయి
జగము కు తెలిసిన
జవాబు లు ఈ రాతలు.
• ఊహల్లో కనపడని
ఇహము కు తెలియని
ప్రశ్నలు ఈ రాతలు.
జగము = విశ్వం
ఇహము = భూలోకం, ప్రస్తుత నివాస లోకం.
యడ్ల శ్రీనివాసరావు 22 May 2023 1:30 AM.
No comments:
Post a Comment