ఆశా పాశం
• కల యేనా ఇది నిజమే నా
ఈ ఆశ కాలం లో కరిగే నా.
• ఏనాడు మిగిలిన శేషమో
ఈనాడు తెలిసేను బుణము.
• కల యేనా ఇది నిజమే నా
ఈ ఆశ కాలం లో కరిగే నా.
• కలవని కలయిక ఈ కావ్యము
యుగము ల ప్రేమ కు ఆధారము.
తెలుసా … మనసా … ఇది ఏనాటి దో.
• ఊహకు అందని ఈ బంధము
వీడని ఆత్మతో సంబంధము
తెలుసా … మనసా … ఇది ఏనాటి దో.
• కల యేనా ఇది నిజమే నా
ఈ ఆశ కాలం లో కరిగే నా.
• ఏనాడు మిగిలిన శేషమో
ఈనాడు తెలిసేను బుణము.
• మనిషే లేని ఈ మననం
మనువే కాని ఓ మదనం
తెలుసా … మనసా … ఇది ఏనాటి దో.
• ప్రేమ ని తెలిసిన ఈ ప్రణయం
గమనం లేని ఓ సజీవం
తెలుసా … మనసా … ఇది ఏనాటి దో.
• కల యేనా ఇది నిజమే నా
ఈ ఆశ కాలం లో కరిగే నా
• ఏనాడు మిగిలిన శేషమో
ఈనాడు తెలిసేను బుణము.
• జడి లేని జావళి ఈ సాహిత్యం
తడి ఆరని మనసు కి సాకారం.
తెలుసా … మనసా … ఇది ఏనాటి దో.
జడి = దుఃఖం, బాధ
జావళి = గీతం, గీతా విశేషం.
సాకారం = రూపం, ఆకారం.
యడ్ల శ్రీనివాసరావు 15 May 2023 , 6:00 AM.
No comments:
Post a Comment