బృందావనం
• గువ్వ లా ఎగరాలి
గూడు దాటి పోవాలి.
గోకులాని కెళ్లాలి
గోపిక నై ఆడాలి.
• గోపాలుని కోసం
గోవు ను అవుతాను
పిల్లనగ్రోవి ని వింటాను.
• కన్నయ్య కోసం
ముద్దులు ఇస్తాను
వెన్నముద్ద ను అవుతాను.
• సాగే ఈ తరుణం
నా కై నిలిచింది.
ఊగే ఈ విరహం
ఏ దో చెపుతుంది.
• భామ ను కావాలి
కృష్ణుని చేరాలి
సత్యభామ నై ఏలాలి
శృం గారం పంచాలి.
• మాధవుని కోసం
సుజాత గా వెలసాను.
పారిజాతమై పూచాను.
• నల్లనయ్య మనసు లో
ధైర్యం నే అవుతాను
శౌర్యం చూపిస్తాను.
• సాగే ఈ తరుణం
నా కై నిలిచింది.
ఊగే ఈ విరహం
ఏ దో చెపుతుంది.
• బృందావనం బహు సుందరం
తేలి ఆడే మనసు ల కి ఇంద్రవనం.
• ప్రేమ పక్షుల నందనం
రాధాశ్యాముల సంగమం.
• గువ్వ లా ఎగరాలి
గూడు దాటి పోవాలి.
గోకులాని కెళ్లాలి
గోపిక నై ఆడాలి.
• భామ ను కావాలి
కృష్ణుని చేరాలి.
సత్యభామ నై ఏలాలి
శృం గారం పంచాలి
తరుణం = సమయం, యవ్వనం
విరహం = ఎడబాటు, వియోగం
సుజాత = మంచి వంశం లో పుట్టిన ఉత్తమ స్త్రీ.
యడ్ల శ్రీనివాసరావు 18 May 2023 9:30 pm.
No comments:
Post a Comment