భువి లో ఓ దీవి
• భువి లోన వెలసింది ఓ దీవి
అది మనసు న అయింది సరోవరం.
• హంసలు విహరించే దేవత లై
కలువలు చిగురించే చెలికత్తె లై.
తలపించెను ఇంద్ర లోకం
మరపించెను భూ లోకం.
• ఈ నవోదయం
జగానికి శుభోదయం.
• భువి లోన వెలసింది ఓ దీవి
అది మనసు న అయింది సరోవరం.
• కమలం విరపూసే కన్యక లా
తుమ్మెద లెగిరెను తారక లా
వికసించెను హరిత వనం
పులకించెను మానస సరోవరం.
• ఈ సమయం
మనసుకి ఆనందమయం.
• భువి లోన వెలసింది ఓ దీవి
అది మనసు న అయింది సరోవరం.
• జల మలజడి చేసేను గజ్జె ల్లే
నది ఒరవడి పొందెను ప్రాస ల్లే.
శిల కాబోదు ఏనాటికీ శిధిలం.
• భువి లోన వెలసింది ఓ దీవి
అది మనసు న అయింది సరోవరం.
యడ్ల శ్రీనివాసరావు 2 Oct 2023, 9:30 pm.
No comments:
Post a Comment