రాయల రాయంచ (దర్జా పావురం)
• రాయలు గ జీవించే రాయంచ
ఏమి కర్మము నీకు
ఎందుకీ వేదన నీకు.
• రాయలు గ కనిపించే రాయంచ
తెలుపు శాంతి అని తెలిసినా
రంగుల పై మో జు ప డ తా వు.
నీ హంగులు చూపుతూ
రంగులు మార్చుతూ ది గ జా రు తా వు.
• రాయలు గ ఎగిరే రాయంచ
స్నేహానికి ప్రేమ కు చిహ్నమని ఊ రే గు తా వు .
నీ గుబురు గొంతు తో
అర్దం లేని పలుకులు ప లు కు తా వు .
మాటలను మ డ త పె డు తు
మాయలు చేస్తావు .
• రాయలు గ బ్రతకలేని రాయంచ
ఏమి యాతన నీకు
ఎందుకీ రోదన నీకు.
• నీ గూడు లోని కూడు
'సు "మ' ధు" రం అంటావు .
గూడు దాటాక
డేగ లా వేట కు వెళ్తావు .
రాయంచ వే అయినా ...
తీరని ఆకలితో
రాబందు కర్మ ఎందుకు.
• రాయలు గ పలికే రాయంచ
దూర దేశాన గూడు లో
'మ ధు' వు పై ఆశ ఎందుకు.
చాప కింద నీరు లా
నేటి జీవనం ఎందుకు.
• ఓ రాయల రాయంచ
మాయ లేడి లా
ఎన్ని రంగుల లో ఎంత మునిగినా
ఎన్ని పొంగుల తో ఎంత మెరిసినా
నీ అసలు రంగు నువ్వే చూపుతుంటావు.
• రాయలు గ అనుభవించే
భోగ భాగ్యాలు ఎన్ని ఉన్నా
చపల బుద్ది తో నిండిన
చాతుర్యమే నీ జన్మకు శిక్ష.
• రాయలు గ జీవించే రాయంచ
ఏమి కర్మము నీకు
ఎందుకీ వేదన నీకు.
పావురం సహజంగా అందంగా తెల్లగా స్వచ్ఛదనంతో దర్జా గా విలాసవంతంగా బయటకు కనిపిస్తుంది. శాంతి కి, ప్రేమ కు, స్నేహానికి చిహ్నం గా ఉంటుంది. అందుకే సాధారణంగా పావురాన్ని చూస్తే ఎవరికైనా మనసు పరవశించి పోతుంది. పావురాన్ని చూసి మనిషి ఎంతో సంతోషం పడతాడు.
కానీ, విధి వక్రించో, మరి ఏ పాప మో తెలియదు ఒక పావురం మాత్రం ఇలా ఉంది.
దర్జా గా జీవించాల్సిన ఓ పావురమా…. ఏమి ఈ కర్మ నీకు , ఎందుకు ఈ వేదన నీకు.
విలాసంగా ఉండవలసిన ఓ పావురమా , నీ సహజ స్వభావం తెలుపు మరియు శాంతి అని తెలిసినా, రక రకాల రంగులు పై మోజు పడుతూ, పంచ రంగులు (బూడిద, ఎరుపు, నలుపు, పచ్చ, తెలుపు) ధరించి చూపరులకు హంగులు వెలగబెడుతూ రంగులు మారుస్తూ స్థాయి దిగజారి పోతున్నావు.
దర్జా గా ఎగురుతున్న పావురమా, నీవు ప్రేమ కు, స్నేహానికి చిహ్నం అంటావు. కాని స్పష్టత లేని మాటలతో , బొంగురు గొంతు తో అర్దం కాకుండా ఎందుకు పలుకులు పలుకుతావు. మాటలు మడతపెట్టి మాయలు చెయ్యడం అలవాటు గా చేసుకున్నావు.
దర్జా గా బ్రతక వలసిన నీకు ఏంటో ఈ యాతన , నిత్యం ఘోష తో కూడిన ఏమిటో నీ రోదన.
నీ గూడు లో ఉన్న కూడు , 'సుమ' ధురం అంటావు. మరి గూడు దాటాక డేగ లాగా వేటకు వెళ్తు , రాబందు లా మారి ఆకలి తీర్చుకుంటావు. చూడడానికి సాత్వికంగా కనిపించినా, ఏమిటో ఈ తీరని కోరికల దయనీయ స్థితి నీకు.
ఓ రాయల రాయంచ దూర సాగర తీరాల లో ఉన్న గూడు లో ని 'మధు' వు అనే తేనే పై ఆశ ఎందుకు. పైకి ఏమీ తెలియని అమాయక జీవనం ఎందుకు.
ఓ పావురమా , మాయ లేడి వలే ఎన్ని రంగులు మార్చినా , ఎంత మెరిసేలా కనిపించినా , నీ అసలు రంగు నీ బుద్ధి, ప్రవర్తన తో నువ్వే బయటకు చూపించుకుంటావు.
ఓ రాయల రాయంచ అన్నీ ఉన్నా నీ లోని అల్ప మైన నీచ బుద్ది తో కూడిన మాటకారి తనమే నీ ప్రస్తుత జన్మ కు శిక్ష.
ఓ దర్జా పావురమా ఏమిటో ఈ కర్మ నీకు , ఏమి పాపం చేసావో, ఈ వేదన నీకు.
యడ్ల శ్రీనివాసరావు 11 Apr 2023 5:00 PM.
No comments:
Post a Comment