Sunday, October 1, 2023

403. కన్నీరు

 

కన్నీరు


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు   అంటే

  అలుసు   కాదని   మసలుకో.


• కన్నీటి    తోనే    జననం

  కన్నీరు   తోనే    మరణం

  కన్నీరు   తోనే    పయనం

  కన్నీటి    తోనే    చరితం.


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు     అంటే

 అలుసు   కాదని  మసలుకో.


• ప్రకృతి    ఉద్వేగం       ఉరుము లై

  కరిగి    నీరై

  శ్యామలం   చేస్తుంది    బీడు.

• మనసు   భావోద్వేగం   దుఃఖ మై

  కరిగి    నీరై

  శాంతి    నిస్తుంది   చూడు.


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు     అంటే

  అలుసు   కాదని   మసలుకో


• ఆనంద        బాష్పాలు

  కంట  జారే   పుష్పాలు...

  పులకించి   పరిమళం    నింపే   పారిజాతాలు.

• అశ్రు         నయనాలు

  వికర్మల     విడుపు కి    నిదర్శనాలు....

  ఎగిరే    పక్షి లా    చేసే    దోహదాలు.


• తెలుసుకో       తెలుసుకో

  కన్నీరు   అంటే

  అలుసు   కాదని  మసలుకో.


• కన్నీరు   మున్నీరు    అయితే

  శోకం    తరిగి

  మనసు  పన్నీరు    అవును.

• కన్నీరు   నిండిన   కావ్యాలు

  కమలమై    విరిసి

  జీవిత   దారిని   చూపును.


• తెలుసుకో        తెలుసుకో

  కన్నీరు       అంటే

  అలుసు  కాదని   మసలుకో


యడ్ల శ్రీనివాసరావు 1 Oct 2023. 6:00 pm.


No comments:

Post a Comment

618. వెలుగు రేఖలు

  వెలుగు రేఖలు   • ఎన్నో   జన్మల    భాగ్యం   ఈ   వెలుగు   రేఖలు  . • అలసిన    వారే      తీరం    చేరును .   సొలసిన   వారికే    అమృతం   దొరక...