ప్రకృతి పాటవం
• లలిత ప్రియ కమలం
విరిసే
కనుల కోసం .
• మధుర జల సరసం
కలిసే
తపన కోసం .
• జాలువారే కిరణం
తపించే
ప్రకృతి కోసం .
• శ్వేత నీలి వర్ణం
ఆశించే
వెన్నెల కోసం .
• విరిసి కలిసిన యోగం
ప్రేమ కు సుందర భాగ్యం .
• తపించే ఆశల భోగం
ప్రేమికుల శృంగార దీపం .
• కారుమబ్బుల హృదయం
హర్షించే
కారుణ్య వర్షం.
• మంచు తెరల అందం
శోభించే
సన్నజాజి వర్ణం.
• మలయ మోహ గంధం
గుబాళించే
మానస స్వర్ణం.
• సూర్యరశ్మి తేజం
కౌగిలించే
పుడమి స్వప్నం .
• హర్షించే శోభన శృతి
మన్మధ లయ సాగరం.
• గుబాళించే వెచ్చని కౌగిలి
స్వర్గం లో తేలే సంబరం .
పాటవం = నైపుణ్యం, సామర్థ్యం.
సరసం = సెలయేరు, సరస్సు.
యడ్ల శ్రీనివాసరావు 23 sep 2023 9:00 pm.
No comments:
Post a Comment