శివమే జీవము
• శివుడే నిజమని తెలుసుకో రా
శివమే జీవమని మసలుకో రా.
• ఎద్దునెక్కి ఏలే టోడు
మన మొద్దు బుద్ధి మార్చుతాడు.
• శూలమునే పట్టి నోడు
మన వికారాలు త్రుంచు తాడు.
• శివుడే నిజమని తెలుసుకో రా
శివమే జీవమని మసలుకో రా.
• బూడిద పూసుకున్నోడు
నిన్ను నన్ను
ఒంటికి రాసుకు తిరుగు తాడు.
• నెత్తిన గంగమ్మ నెత్తినోడు
దప్పిక నే ఎరగనివ్వడు.
• అన్నమెట్టే అన్నపూర్ణ
ఇంటాయన శివుడు రా …
• ఆకలితో నిన్ను నన్ను
ఎన్నడూ వదలడు రా.
• శివుడే నిజమని తెలుసుకో రా
శివమే జీవమని మసలుకో రా.
• కాలము నే కదిలించే టోడికి
గొంతు లో గరళం
మనసేమో అమృతం.
• మృత్యువు నే శాసించే టోడికి
రూపం లో రౌద్రం
దేహమేమో ధ్యానం.
• శివుడే నిజమని తెలుసుకో రా
శివమే జీవమని మసలుకో రా.
• సందేలపు సంబరాలు
అర్ధరాత్రి మెలకువలు.
• ఆదిశంకరుని లీలలు
జగతికి దివ్య ఆనవాళ్లు.
• మాయచేయని వాడు
మర్మమెరుగని వాడు
• కర్మనే కొలతగా
చేసేటి వాడు విభుడు.
• శివుడే నిజమని తెలుసుకో రా
శివమే జీవమని మసలుకో రా.
🙏ఓం నమః శివాయః 🙏
తులసి రామ కృష్ణ, యడ్ల శ్రీనివాసరావు.
6 Sep 2023 , 7:00 pm.
No comments:
Post a Comment