Saturday, September 2, 2023

395. ప్రజా గాయకుడు గద్దర్

 

గద్దర్

ప్రజా గాయకుడు 

అమర వీరుడు గద్దర్ కు నివాళుల తో ....


• అమర వీరుడా    ఓ    అమర వీరుడా

  అశువులు బాసిన    సమర  యోధుడా.


• బడుగు   జీవుల    ఆరాటం

 నువు   మోసిన   "పల్లకి"    పోరాటం.

• ఆకలి   దప్పుల    ఆవేశం

  నువు  వేసిన    బాటకు    సోపానం.


• అమర వీరుడా   ఓ   అమర వీరుడా

  అశువులు  బాసిన   సమర   యోధుడా.


• నల్ల కంబళి  … ఆ …  నల్ల కంబళి

  నీ నిరసన కాదు

  పెత్తం దొరలకు      భేతాళ  స్వప్నం.

  భేతాళ స్వప్నం      భేతాళ నృత్యం

  భేతాళ స్వప్నం      భేతాళ నృత్యం.


• అమర వీరుడా     ఓ    అమర వీరుడా

  అశువులు   బాసిన    సమర యోధుడా.


• తూటాలు దిగినా  … ఆ.. తూటాలు దిగినా

  తెంచ లేదు లే     నీ  ప్రాణం.

  తుంచ  లేదు లే    నీ లక్ష్యం.


• రకతం కారినా … ఆ …  రకతం కారినా 

  రంగు  మారలేదు లే    నీ  రంగం

  సరికదా   వరదై   పొంగింది

  చైతన్యం  …  నీ  చైతన్యం.


• అమర వీరుడా    ఓ    అమర వీరుడా

  అశువులు  బాసిన   సమర  యోధుడా.


• గజ్జె కట్టిన    నీ పాదం …  ఆ …

  గజ్జె కట్టిన    నీ పాదం

  బడుగుల   మనసులో

  గంటై మోగింది

  గుడి గంటై మారు మోగింది.


• పదం  కట్టిన   నీ పద్యం

  అందరి   ఆశై  సాగింది

  శ్వాసై   పాడింది

  ఆశై సాగింది  …  శ్వాసై పాడింది.


• పేదల కోసం         ప్రమిధై   నిలిచావు

  నీ ఊపిరి నంతా   సమిధ   చేసావు.


• అమర వీరుడా     ఓ   అమర వీరుడా

  అశువులు   బాసిన   సమర  యోధుడా.


యడ్ల శ్రీనివాసరావు 2 sep 2023 , 10:00 pm.


No comments:

Post a Comment

495. అర్పితం

అర్పితం • పూస ను    కాను   పూస ను    కాను   నీ హారం లో   పూస ను  కాలేను. • పూవు ను   కాను   పూవు ను   కాను   నీ మాలలో   పూవు ను   కాలేను...